E-Paper
Advertisement

Harish Rao: నోటీసుల డ్రామాతో బొగ్గు స్కామ్ ఆపలేరు.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

Harish Rao: నోటీసుల డ్రామాతో బొగ్గు స్కామ్ ఆపలేరు.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Advertisement

తెలంగాణలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. వరుసగా బీఆర్ఎస్ నాయకులకు అందుతున్న సిట్ (SIT) నోటీసుల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.

డైవర్షన్ పాలిటిక్స్ పై విమర్శలు

Advertisement

‘నిన్న నాకు నోటీసు ఇచ్చారు, నేడు కేటీఆర్ నోటీసు ఇచ్చారు. ఇదంతా కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్’ అని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన బొగ్గు స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ నోటీసుల డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో, ఆ భయంతోనే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రతీకారం బలహీనుల ఆయుధం

Advertisement

రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ గుర్తుపెట్టుకో.. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం. దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటూ బలహీనంగా వ్యవహరిస్తోందని, కానీ బీఆర్ఎస్ నాయకులు ధైర్యవంతులని, ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తారని స్పష్టం చేశారు. నోటీసులకు సమాధానం చెప్పడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని, అయితే రేపు ప్రజా కోర్టులో సమాధానం చెప్పడానికి రేవంత్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

హామీల అమలుపై పోరాటం

ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది నాయకులను విచారణ పేరుతో వేధించినా వెనక్కి తగ్గేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ‘బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఆరు గ్యారెంటీలు. 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని ఆయన ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని, బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

ALSO READ: KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు, ఇక జైలుకేనా..?

Related News

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

Big Stories

Advertisement
×