E-Paper
Advertisement

Harish Rao: విశాఖ తరహాలో.. ఖాజీపేటను రైల్వే జోన్ చేయాలి.. రేవంత్‌దే బాధ్యత

Harish Rao: విశాఖ తరహాలో.. ఖాజీపేటను రైల్వే జోన్ చేయాలి.. రేవంత్‌దే బాధ్యత
Advertisement

Harish Rao: ఏపీలోని విశాఖను డివిజిన్ చేసినట్లు ఖాజీపేటను రైల్వే జోన్ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రధానిని బడే బాయ్ అంటున్న రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలని కోరారు. ఈ బాధ్యతను ఆయనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.

కేసీఆర్ వల్లే.. కోచ్ ఫ్యాక్టరీ

‘కొలువుల కోసం కొట్లాట’ పేరుతో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వద్ద శనివారం బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు.. కోచ్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలని ఇవ్వాలని పట్టుబట్టారు. 50 ఏళ్ల పోరాట ఫలితమే ఈ కోచ్ ఫ్యాక్టరీ అని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులు, వ్యాపారుల అవకాశాల కోసం ఎంతో కాలంగా పోరాడినట్లు గుర్తుచేశారు.

స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు

Advertisement

కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చినప్పటికీ సరైన గెజిట్ మాత్రం రాలేదని హరీశ్ రావు అన్నారు. వ్యాగన్ ఫ్యాక్టరీనా లేక కోచ్ ఫ్యాక్టరీనా అనే దానిపై గెజిట్ లేదన్నారు. అయితే మహారాష్ట్ర లాతూరులో ఏర్పాటు చేసిన కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. కాబట్టి ఖాజీపేటలోనూ భూ నిర్వాసితులకు, స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టారు. లేకుంటే బీజేపీ ఎంపీలను, మంత్రులను అడ్డుకుంటామన్నారు. ప్రారంభోత్సవానికి ముందే 70 శాతం ఉద్యోగాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Harish Rao: భూ భారతి కాదు.. భూ దోపిడీ.. సిట్ విచారణకు హరీశ్ రావు డిమాండ్

‘ఖాజీ పేటను రైల్వే జోన్ చేయాలి’

Advertisement

మరోవైపు ఏపీలో విశాఖపట్నంను డివిజన్ చేసినట్లే ఖాజీపేటను రైల్వే జోన్ చేయాలని హరీశ్ రావు అన్నారు. ప్రధానిని బడే బాయ్ అంటున్న రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలని చెప్పారు. ఏపీలో విశాఖపట్నంను డివిజన్ చేసి మా ఖాజీపేటను ఎందుకు జోన్ చేయట్లేదని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో దీనిపై ప్రశ్నిస్తామని చెప్పారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇప్పించింది బీఆర్ఎస్ అని.. భూ నిర్వాసితులకు అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే వారి తరపున పోరాటానికైనా సిద్ధమేనని చెప్పారు.

Also Read: Pak-Afghan War: పాక్‌పై విరుచుకుపడ్డ తాలిబన్లు.. ఆర్మీ స్థావరాలు ధ్వంసం.. 6 ఫైటర్ జెట్స్ కూల్చివేత!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×