E-Paper
Advertisement

Harish Rao: భూ భారతి కాదు.. భూ దోపిడీ.. సిట్ విచారణకు హరీశ్ రావు డిమాండ్

Harish Rao: భూ భారతి కాదు.. భూ దోపిడీ.. సిట్ విచారణకు హరీశ్ రావు డిమాండ్
Advertisement

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ అక్రమార్కులకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ధరణి మీద బురదజల్లి భూ భారతీ తెచ్చామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆ పోర్టల్‌లో జరుగుతున్న కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడిన హరీశ్ రావు.. భూ భారతి పోర్టల్ పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. దళారులకు ఈ పోర్టల్ హారతి పడుతోందని మండిపడ్డారు.

37 మండలాల్లో కుంభకోణం

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పూర్తి డబ్బులు కడుతుంటే.. అందులో 10 శాతం మాత్రమే ప్రభుత్వానికి వెళ్లేలా భూ భారతి పోర్టల్ లో మార్పులు చేశారని హరీశ్ రావు ఆరోపించారు. మిగతా 90 శాతాన్ని దళారులు తమ జేబుల్లో వేసుకుంటున్నారని విమర్శించారు. 37 మండలాల్లో ఈ భూ భారతి కుంభకోణం దర్జాగా నడుస్తుంటే కనీసం నిఘా వ్యవస్థలకు కూడా తెలియకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని విమర్శించారు.

నామమాత్రంగా ఆపరేటర్ల అరెస్టు

Advertisement

భూ భారతి కుంభకోణం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద అధికారులు ఉన్నారని హరీశ్ రావు ఆరోపించారు. వాళ్ల పేర్లు బయటకు రాకుండా కవర్ చేయడానికే నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి కమీషన్ల మీద కమీషన్లు, సిట్ లు వేస్తున్న రేవంత్ రెడ్డి.. ఈ భూ భారతి కుంభకోణంపై, ప్రభుత్వ ఖజానా లూటీపై సిట్ తో విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు.

హైకోర్టు చెప్పినా.. మారలేదు

లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని హరీశ్ రావు ఆరోపించారు. నేడు ఆ జాబితా కోటి ఎకరాలు దాటిందని.. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నమ్మకంగా నాట్లకు ముందే రైతుబంధు వచ్చేదని.. రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలు ఉంటేనే రైతుబంధు వేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Also Read: Pak-Afghan War: పాక్‌పై విరుచుకుపడ్డ తాలిబన్లు.. ఆర్మీ స్థావరాలు ధ్వంసం.. 6 ఫైటర్ జెట్స్ కూల్చివేత!

ఏపీకి అడ్డగోలుగా నీళ్ల మళ్లింపు

మరోవైపు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ నీటిని వినియోగించుకుంటోందని హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా మన నీళ్లను మళ్లిస్తుంటే రేవంత్ రెడ్డి అడ్డుపడటం లేదన్నారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఇలాగే వదిలేస్తే రేపు హైదరాబాద్ కు మంచినీళ్ల కటకట వస్తుందని హెచ్చరించారు.

Also Read: TG Education Reforms: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలు.. టీచర్ల ప్రమోషన్ల పై కీలక సిఫార్సులు..?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×