E-Paper
Advertisement

Constable Incident: వికారాబాద్‌లో విషాదం.. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం ఉందంటే!

Constable Incident: వికారాబాద్‌లో విషాదం.. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం ఉందంటే!
Advertisement

Constable Incident: కర్తవ్య నిర్వహణలో చురుగ్గా ఉంటూ, తోటివారికి ధైర్యాన్నిచ్చే స్థితిలో ఉన్న ఒక రక్షక భటురాలు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్య (28) గంగారం సాయిబాబా కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2018 బ్యాచ్‌కు చెందిన దివ్య, గత కొన్నేళ్లుగా వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతాయుతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సమాజంలో ఇతరులకు ధైర్యం చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఆమె, స్వయంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అటు పోలీసు శాఖలోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement

అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దివ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ రాసిన సూసైడ్ లెటర్ అక్కడ లభ్యమైంది. అందులో “తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, కేవలం మానసిక ఒత్తిడి (Mental Stress) తట్టుకోలేక, నేను నీకు బారం కాకుడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మ.. నాన్న ఉంటే బాగుండే అమ్మ.. నాన్న లేనందుకే నీకు ఇన్ని కష్టాలు నన్ను క్షమించూ అమ్మ”.. అని లేఖలో ఆమె పేర్కొన్నారు.. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె ఒత్తిడికి గల మూల కారణాలను అన్వేషిస్తున్నారు.

అయితే, దివ్య ఆత్మహత్య వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి నిశ్చయించే క్రమంలో సంబంధాలు చూస్తున్నారని, త్వరలో పెళ్లి చూపులు కూడా జరగాల్సి ఉందని సమాచారం. కానీ, ప్రస్తుతానికి వివాహం చేసుకోవడం దివ్యకు ఇష్టం లేదని, ఈ విషయంలోనే కొంత మానసిక సంఘర్షణకు లోనయ్యారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేకనా లేక వృత్తిపరమైన ఒత్తిడా అన్న కోణంలో విచారణ సాగుతోంది.

Advertisement

ఒక యువ కానిస్టేబుల్‌గా కెరీర్ లో నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలాంటి విషాదంతం జరగడం బాధాకరం. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచే పోలీసులు, తమ వ్యక్తిగత జీవితంలోని ఒత్తిడిని జయించలేకపోవడం వ్యవస్థలో ఉండాల్సిన కౌన్సెలింగ్ అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. దివ్య మృతితో ఆమె కుటుంబంలో తీరని శోకం నెలకొంది.

Also Read: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. స్పాట్‌లో 15 మంది

ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆధారాలను సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోన్ కాల్ డేటా విశ్లేషణ తర్వాత ఈ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×