BigTV English

KCR With Harish Rao: ముచ్చటగా మూడోసారి.. కేసీఆర్‌తో హరీష్ భేటీ, ఆ విధంగా ముందుకు

KCR With Harish Rao: ముచ్చటగా మూడోసారి.. కేసీఆర్‌తో హరీష్ భేటీ, ఆ విధంగా ముందుకు

KCR With Harish Rao: కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ముచ్చటగా పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు హరీష్‌రావు. ఇరువురు మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి. కాకపోతే తొలుత కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించారట. ఆ తర్వాత పార్టీ సంక్షోభం గురించి మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి.


కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత కేసీఆర్‌తో హరీష్‌రావు మూడోసారి భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. కమిషన్ ముందు హాజరవుతానని మంగళవారం సాయంత్రం వెల్లడించారు కేసీఆర్. దీంతో  కమిషన్ ఎదుట మాట్లాడాల్సిన అంశాలపై ఇరువురు చర్చించారు.

కమిషన్ ముందు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని పెద్దాయన అన్నారట. ఎందుకంటే ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మనం నోరు జారితే అంతా బయటకు వస్తుందని, సైలెంట్‌గా ఉండడమే బెటరని అంచనాకు వచ్చారట. కాకపోతే కొన్ని ప్రశ్నలకు ప్రత్యర్థులకు దొరక్కుండా సమాధానాలు ఇస్తే బెటరని అన్నారట.


అధికారులు, కాంట్రాక్టర్లు అందరు తమకు వ్యతిరేకంగా కమిషన్ ముందు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలను ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? ఆనాడు నిధులు ఏ ప్రాతిపదికను కేటాయించారు? అధికారుల నుంచి సమాచారం లేకుండా నిధులు కేటాయించారు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏవిధంగా చెప్పాలని అధినేతను హరీష్‌రావు అడిగారట.

ALSO READ: గేమ్ మొదలుపెట్టిన కవిత, కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు, బీఆర్ఎస్ దిగొస్తుందా?

గతంలో తాను నీరుపారుదల శాఖ మంత్రిగా పని చేశానని, వీటిపై ప్రశ్నలు లేవనెత్తితే ఈ విధంగా చెప్పాలని అడిగారట. ఈ వ్యవహారంపై మామ-మేనల్లుడు దాదాపు గంటకు పైగానే చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో కవిత వ్యవహారంపై చిన్నపాటి చర్చ జరిగినట్టు సమాచారం.

మనకు తెలీకుండా సొంతంగా కేడర్‌ని నిర్మించుకునే పనితో ఉందని, ఇలాంటి వ్యవహారాల్లో ఆలస్యం వద్దని అన్నారట హరీష్‌రావు. ఒకవేళ కాంగ్రెస్‌ వైపు వెళ్తే మనకు సానుకూలంగా ఉంటుందని, ఫ్యామిలీని విడదీసిందని చెప్పి అధికార పార్టీపై ప్రచారం చేయడానికి అస్త్రం లభించినట్టు అవుతుందని పెద్దాయన అన్నట్లు పార్టీ వర్గాల మాట.

సొంతంగా కేడర్‌ని నిర్మించుకుంటే పార్టీలో నేతలు డైలామాలో పడతారని అన్నారట. పార్టీకి ఈ వ్యవహారం మరింత ముప్పుగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారట. మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత సత్తా ఏంటో తెలుస్తుందని, అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.  భేటీ వ్యవహారంపై హరీష్‌రావు మీడియా ముందు ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.

Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×