Jr.NTR: స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పాటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ,చిరంజీవి (Chiranjeevi) లపై చేసిన షాకింగ్ కామెంట్లకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన చాలామంది మెగా ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ పాత వీడియోలో ఎన్టీఆర్ ఏమని మాట్లాడారు.. ?ఎందుకు అంతలా మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై మండి పడుతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
చిరు, పవన్ పై ఎన్టీఆర్ ఊహించని కామెంట్స్..
చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఎంతోమంది ఈయనపై విమర్శలు చేశారు. ముఖ్యంగా చిరంజీవికి వ్యతిరేకంగా ఉండే ఇతర పార్టీ నాయకులైతే.. ఇదేమైనా సినిమా అనుకున్నారా.. ? అలా వచ్చి ఇలా హిట్ కొట్టి వెళ్లిపోవడానికి రాజకీయాలు అంటూ ఆయన్ని విమర్శించారు. అయితే చిరంజీవిపై వచ్చిన ఈ విమర్శలు తట్టుకోలేక చివరికి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి రాజకీయాల నుండి తప్పుకున్నారు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో జూ.ఎన్టీఆర్ మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఎన్టీఆర్ ఏం మాట్లాడారంటే.. “ఈ మధ్యకాలంలో కొత్తగా రాజకీయాల్లోకి ఓ పార్టీ వచ్చింది. మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు.. వీళ్లకు అవకాశం ఇచ్చారు.. మాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వండి అన్నారు.. అయినా ఇదేమైనా సినిమానా అవకాశం ఇవ్వడానికి.. అసలు మిమ్మల్ని ఎవరూ రమ్మన్నారు అంటే.. మమ్మల్ని ప్రజలు పిలిచారు అంటున్నారు. అయినా ఇదేమైనా పెళ్లి పిలుపా…బొట్టు పెట్టి మరీ రాజకీయాల్లోకి రండి అని పిలవడానికి.. ఇది పెళ్లి పిలుపు కాదు ఇది సమాజం.. మాకు స్వాతంత్ర్యం తీసుకురండి అని గాంధీ గారిని బొట్టుపెట్టి మరీ ఎవరైనా పిలిచారా.. దళిత సోదరులకు న్యాయం చేయండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరైనా పిలిచారా.. మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని పిలవడానికి” అంటూ మాట్లాడారు.
మళ్లీ మొదలైన మెగా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్ వార్..
అయితే అప్పటి పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడింది చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల గురించే అని ఎన్టీఆర్ పై మండి పడుతున్నారు.అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి సపోర్ట్ గా ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ చిరంజీవిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా మరోసారి ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో మళ్లీ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. అయితే రాజకీయాల్లో వైరం విషయం పక్కన పెడితే, ప్రస్తుతం ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.
ALSO READ:Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్‌కు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు!