E-Paper
Advertisement

Harish Rao: ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతా : మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao: ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతా : మాజీ మంత్రి హరీశ్ రావు
Advertisement

Harish Rao: ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆయనను కలిసి, ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్మికుల పక్షాన నిలబడి సమస్యలను సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి, కార్మికులకు చేస్తున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడుకోవాలని కార్మికులు పోరాడుతుంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీని నిర్వీర్యం

కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు అప్పగించి, వారికే సబ్సిడీలు ఇస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా 2000 బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్ బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలను నేరుగా ఆర్టీసీకే ఇప్పించి, సంస్థ సొంతంగా బస్సులు కొనుగోలు చేసుకునేలా పథకంలో సవరణలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జీరో టికెట్ అమలు కోసం ప్రతినెలా 350 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇపుడు అరకొర నిధులు చెల్లించి చేతులు దులుపుకోవడం శోచనీయమని మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని ఆర్టీసీపైనే మోపడం వల్ల సంస్థ ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ రెండు పీఆర్సీలు పెండింగ్లో ఉండగా, 2025 పీఆర్సీ సైతం అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు.

Advertisement

Also Read: Thummala Nageswara Rao: ప్రతి నెలా 2లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలి.. జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ

ప్రభుత్వం గత 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదు 

సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు మొత్తాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గత 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదని మండిపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా నిలుస్తుందనుకున్న డబ్బు చేతికి రాక కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ‘అపాయింటెడ్ డే’ ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికులకు దక్కాల్సిన పదోన్నతులు, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండి మండిపడ్డారు.

ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ

Advertisement

ఉచిత ప్రయాణం పథకం సజావుగా సాగుతోందని డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం.. రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనడంలో, సిబ్బందిని నియమించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సిబ్బంది కొరతతో ఉన్న కార్మికులపై తీవ్ర పని భారం పడుతోందని, ఆ ఒత్తిడి వల్ల కార్మికులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమను చూపించకుండా. తక్షణమే 2,804 కోట్ల బకాయిలను విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, కార్మికుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బలంగా బీఆర్ఎస్ పక్షాన వినిపిస్తామన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేలా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

రిటైర్డ్ ఉద్యోగులపై చిన్నచూపు

రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని హరీశ్ రావు ప్రశ్నించారు.ప్రభుత్వ తీరు వల్ల బెన్ఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రిటైర్డ్ ఉద్యోగులు కలిసి వినతిపత్రం అందజేశారు. హక్కుగా రావాల్సిన బెన్ఫిట్స్ కోసం విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వేదనకు గురవుతున్నారన్నారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బిఆర్ఎస్ అండగా అంటుందని, అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 98 వేల కోట్లకు టెండర్లు పిలిచారని, బడా కాంట్రాక్టర్లకు 40 వేల కోట్లు చెల్లించారని, కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు కోహిడ చంద్రమౌళి, ప్రభాకర్ రావు, జైరాం, భిక్షపతి తదితరులు ఉన్నారు.

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×