E-Paper
Advertisement

Hate speech : రేవంత్ ‘హేట్ స్పీచ్’ అస్త్రం.. ఇక నోర్లు మూగబోవాల్సిందేనా?

Hate speech : రేవంత్ ‘హేట్ స్పీచ్’ అస్త్రం.. ఇక నోర్లు మూగబోవాల్సిందేనా?
Advertisement

‘హేట్ స్పీచ్’ ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదే వినిపిస్తోంది. సామాజిక మాద్యమాల మొదలు పార్టీ మీటింగులు, మీడియాలో కొందరు నేతలు ఎదుటివారిని ఇష్టానుసారంగా దూషించడం, ఓ వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని రెచ్చగొట్టడం వంటివి చేస్తున్నాయి. ఫలితంగా అది జాతి, కుల, మతాల వారిగా వైషమ్యాలు పెంచి మనుషుల మధ్య మానవత్వాన్ని, స్నేహభావాన్ని దూరం చేసి స్పర్ధలు పెంచుతున్నాయి.నాయకులు, కొందరు వ్యక్తుల వలన కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. సమాజానికి ఇలాంటివి మంచిది కాదని భావించిన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

విద్వేషపూరిత ప్రసంగానికి చెక్..

ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి కొందరు కావాలని ఓ వర్గాన్ని ఎక్కువ చేయడం, ఓ వర్గాన్ని తక్కువ చేయడం వంటివి చేస్తున్నారు. మెజార్టీ ఓటర్లను పొగడాలి, మైనార్టీ ఓటర్లను తిట్టాలి. ఇదే వారి ఎజెండా.. ఇలా చేయడం ద్వారా మెజార్టీ ఓటర్లను తమవైపునకు తిప్పుకోవచ్చిన కొందరు భావస్తున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా మరికొందరు మైనార్టీ ఓట్ల కోసం మెజార్టీ ఓటర్లను తిడుతున్నారు. ఇలా చేయడం ద్వారా మీకు మేమున్నామని చెప్పుకుని వారి ఓట్లను క్యాచ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తం ఇదే తరహా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక కొన్ని చోట్ల కులాలను అడ్డం పెట్టుకుని సైతం పాలిటిక్స్ నడుస్తున్నాయి.మనమే గొప్ప..మనకంటే ఏది గొప్పకాదని ఓ కులం వారిని ఎత్తుకోవడం,మరో కులం వారిని కిందపడేయడం వంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చేయడం ఇకమీదట ఆమోదనీయం కాదు.

బిల్లులో కీలక అంశాలు..

Advertisement

‘డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాల వల్లే నేరాలు పెరుగుతున్నాయి. దీంతో సమాజంలో అశాంతి పెరుగుతోంది. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపు ఆధారంగా వ్యక్తులు, గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. ద్వేషం, విభేదాలను ఎవరైతే ప్రోత్సహిస్తుంటారో ముందుగా వారిని గుర్తించి శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతకాలం ఏదైనా సోషల్ మీడియా గ్రూపు.. (వాట్సాప్, ఫేస్‌బుక్)లో ఏదైనా విద్వేషపూరిత పోస్టు(మతం, కులం, భాష, లింగం) ఆధారంగా పెడితే కేవలం అడ్మిన్ మద మాత్రమే చర్యలు ఉండేవి. ఇప్పుడు గ్రూపులోని సభ్యులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక ఎవరైతే ఒకరి వలన బాధింపబడ్డారో వారికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ద్వేషపూరిత కామెంట్స్, నేరం చేసిన వ్యక్తికి ఏడాది నుంచి ఏడేండ్ల పాటు జైలు శిక్ష.. రూ.50వేల జరిమాన విధించే అవకాశం ఉంటుంది. రెండోసారి కూడా ఇలాంటి నేరం చేస్తే రెండేండ్ల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమాన విధించనున్నారు’ హేట్ స్పీచ్ చట్టంలో పొందుపరిచారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ వేట.. రూ. 25 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!

Advertisement

ఈ చట్టానికి సంబంధించిన బిల్లును రేవంత్ సర్కార్ ప్రస్తుతం సెలెక్ట్ కమిటీకి పంపించింది. అక్కడ ఏదైన మార్పులు చేర్పులు సూచిస్తే అవి చేసిన అనంతరం తిరిగి బిల్లు అసెంబ్లీకి ముందుకు రానుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించినా, పొలిటికల్ పార్టీ మీటింగులు జరిగినా ఎవరైనా విద్వేషపూరిత ప్రసంగం చేసే చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి.జరిమానాతో పాటే జైలు శిక్ష కూడా ఉండనుంది. ఇప్పటికే చట్టాన్ని కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చింది. త్వరలోనే రాష్ట్రంలోనూ చట్టరూపం దాల్చనుంది. ఇకమీదట బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు మాట్లాడేటప్పుడు, ప్రసంగాలు చేసే సమయంలో ఆచితూచి మాట్లాడాల్స ఉంటుంది. లేదంటే వారు చట్టప్రకారం వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×