E-Paper
Advertisement

Student Suicide: నారాయణ స్కూల్‌లో దారుణం.. 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..

Student Suicide: నారాయణ స్కూల్‌లో దారుణం.. 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
Advertisement

Student Suicide: హైదరాబాద్‌లో ఇటీవల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వివిధ కారణాలతో సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హయత్‌నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రెడ్డిగా గుర్తించారు. విద్యార్థి మృతిపై హాస్టల్ యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో లోహిత్ ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం నాడు పాఠశాల తరగతుల భాగంగా.. ఫిజిక్స్ టీచర్ లోహిత్‌ను క్లాస్ లీడర్‌తో కొట్టించడంతో తీవ్ర మనస్తాపానికి గురై.. అర్ధరాత్రి సమయంలో హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఉపాధ్యాయులు టార్చర్ వల్లే తమ కుమారుడు మృతి చెందాడంటూ తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ రెడ్డి చనిపోయాడన్న విషయం పోలీసులు చెబితేనే తెలిసిందని బంధువులు చెబుతున్నారు.

Advertisement

Also Read:  తెలంగాణ అప్పులపై చర్చ.. చరిత్ర వద్దు, అసలు విషయానికి రండి

అయితే క్లాస్ రూమ్‌లో అసలేం జరిగిందో ఇంతవరకు స్కూల్ యాజమాన్యం చెప్పలేదని విద్యార్ది తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ. లక్షల్లో ఫీజులు గుంజుకుని తమ పిల్లల చావుకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆత్మహత్య చేసుకున్న బాబు మృతదేహాన్ని ఉస్మానియా మార్చడానికి తరలించారు. నారాయణ స్కూల్ వేధింపుల వల్లే లోహిత్ చనిపోయాడు అంటూ స్కూల్ ముందు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు.

Advertisement

ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. లోహిత్ రెడ్డి స్కూల్ నుంచి వెళ్ళిపోతానని టీసి ఇవ్వమన్నా స్కూల్ యాజమాన్యం ఇవ్వలేదని బంధువులు చెబుతున్నారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే బాబు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×