Bhatti Vikramarka vs Harish Rao: తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార-విపక్షాల మాటల యుద్ధం సాగింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అప్పులపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాటపై కౌంటరిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
గ్లోబెల్ ప్రచారం చేస్తున్నామన్న మాటలపై మండిపడ్డారు. క్వశ్చన్ అవర్ వేస్టు చేయడం కరెక్టు కాదన్నారు. వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు డిప్యూటీ సీఎం. రూల్స్ బుక్ బీఆర్ఎస్ హయాంలో తయారు చేశారన్నారు. వారి తీసుకొచ్చిన రూల్స్‌బుక్‌నే తాము అమలు చేస్తున్నామన్నారు.
సభా నిబంధనలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉల్లఘించారని ఆరోపించారు డిప్యూటీ సీఎం. సభలో మీరిచ్చిన హామీలు ఏంటని అమలు చేశారని ఏకిపారేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ? డబుల్ బెడ్రూమ్ ఎవరికిచ్చారు? ఉద్యోగాలు ఎక్కడ అంటూ ఎదురుదాడికి దిగారు.
సభకు సంబంధించిన అంశాలు బయటకు మాట్లాడకూడదంటూ చెప్పడాన్ని తప్పుబట్టారాయన. అప్పులపై ప్రశ్న అడిగితే ఏడు లక్షల పైబడి ఉన్నాయని తాము చెప్పామని అన్నారు. దీనిపై చర్చకు తాము రెడీ అని అన్నారు. ఇదేక్రమంలో బీఏసీ సమావేశంలో జరిగిన కొన్ని విషయాలు బయటపెట్టారు విక్రమార్క.
ALSO READ: కేటీఆర్ అరెస్ట్ కు రెడీ? మీదే లేట్.. ప్లాన్-బి కూడా రెడీనే!
శాసనసభకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు శాసించినట్లు సభ నడవాలంటే కుదరదన్నారు. నిబంధనల ప్రకారమే అందరూ నడుచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సభలో నినాదాలు చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ హంగామా చేయడం సరికాదన్నారు.
బీఏసీ సమావేశంలో స్పీకర్‌ను బీఆర్ఎస్ అవమానించి.. పేపర్లు పడేసి వెళ్లిపోయారని ఆగ్రహించారు. స్పీకర్ అంటే బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు. మాట్లాడితే సభాపతిపై ఎటాక్ చేయడం సరికాదన్నారు. ఇదే క్రమంలో హరీష్‌రావు మాటలపై స్పీకర్ నోరెత్తారు. సభను చూసేది కేవలం వికారాబాద్ ప్రజలు మాత్రమే కాదని, రాష్ట్ర-దేశ ప్రజలు చూస్తున్నారని చురక అంటించారు.
బీఆర్ఎస్ హయాంలో దాదాపు రూ. 45 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టారన్నారు డిప్యూటీ సీఎం. ఒక్క సివిల్ సప్లైలో రూ.18 వేలకోట్ల బకాయిలున్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులపై రూ.20 వేల కోట్లను క్లియర్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ధాన్యం గింజను కొన్నామని బీఆర్ఎస్ సభ్యులు చెప్పడాన్ని తప్పుబట్టారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతులకు మూడు రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. పదేళ్ల ప్రభుత్వంలో మీరు ఇచ్చారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పులపై సభలో చర్చ పెట్టాలని ఎమ్మెల్యే హరీష్‌రావు సభను డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ ను స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్ర అప్పులపై సభలో చర్చ పెట్టాలంటున్నారు.. మేం రాగానే వైట్ పేపర్ పెట్టాం
మళ్లీ చర్చ పెట్టాలంటే మేం రెడీనే
స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధమే
సభా నియమాల గురించి ప్రివిలేజ్ రూల్స్ బుక్… https://t.co/9WOrZTzICP pic.twitter.com/2tWfeG51P8
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2024