Travis Head Captaincy: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావీస్ హెడ్.. భారత జట్టుకు కొరకరానికి కొయ్యగా మారాడు. భారత్ తో మ్యాచ్ అంటేనే హెడ్ {Travis Head Captaincy} వీరబాదుడు బాదుతున్నాడు. భారత్ తో టెస్ట్, వన్డే, టి-20.. ఇలా ఏ ఫార్మాట్ జరిగినా ఇతను {Travis Head Captaincy} మాత్రం వీరంగం సృష్టిస్తున్నాడు. 2023 నుండి భారత్ పై హెడ్ 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. 19 ఇన్నింగ్స్ లలో 61.9 యావరేజ్ తో హెడ్ 1052 పరుగులు చేశాడు.
Also Read: IND vs AUS: మళ్లీ అదే తప్పు.. నీకు బ్యాటింగ్ చేతకాదంటూ కోహ్లీపై గవాస్కర్ సీరియస్
అలాగే 2023 నుండి ఇతర జట్లపై 54 మ్యాచ్ లలో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 1875 పరుగులు చేశాడు. ఇటీవల అడిలైట్ వేదికగా జరిగిన రెండో టెస్టులోను హెడ్ {Travis Head Captaincy} సెంచరీ సాధించాడు. ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సులతో భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఒక టెస్టులో ఓ ప్లేయర్ రెండు ఇన్నింగ్స్ లో మొదటి బంతికే డక్ అవుట్ అవ్వడాన్ని కింగ్ పెయిర్ అంటారు. గబ్బ వేదికగా అంతకు ముందు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో హెడ్ రెండు ఇన్నింగ్స్ లో ఇలాగే అవుట్ అయ్యాడు.
వెస్టిండీస్ కంటే ముందు జరిగిన మ్యాచ్ లోను హెడ్ {Travis Head Captaincy} గోల్డెన్ డక్ అవుట్ కావడం గమనార్హం. కానీ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం శతకంతో చెలరేగాడు. హెడ్ రెడ్ బాల్ ఫార్మాట్ లో టీం ఇండియా పై సెంచరీ సాధించగా.. వైట్ బాల్ లో కూడా భారత్ పై సెంచరీ చేశాడు. అంతేకాకుండా భారత జట్టు పైనే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో సెంచరీ సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా హెడ్ సెంచరీ సాధించాడు. ఇక టి-20 వరల్డ్ కప్ లో టీం ఇండియా పై ఆఫ్ సెంచరీ సాధించాడు.
ఇప్పుడు (బిజిటి) లోను సెంచరీ సాధించాడు. అంటే భారత జట్టుపై హెడ్ {Travis Head Captaincy} ఎలా రెచ్చిపోయి ఆడుతున్నాడో ఈ రికార్డులను బట్టి స్పష్టం అవుతుంది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ హెడ్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. అదేంటంటే.. టీమిండియా తో టెస్ట్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లబోతోంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఈ టూర్ కి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్ జనవరి 27 నుండి ప్రారంభం కాబోతోంది. అయితే అదే సమయంలో పాట్ కమిన్స్ భార్య బెకి తమ రెండవ బిడ్డకు జన్మను ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కమిన్స్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి తెలియజేశాడని రిపోర్ట్ లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ టూర్ కి కమిన్స్ దూరమైతే.. కెప్టెన్సీ బాధ్యతలు హెడ్ {Travis Head Captaincy} కి అప్పగించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.