Kriti Sanon: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Rauth)దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)హీరోగా నటించిన ‘ఆది పురుష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కృతిసనన్(Kriti Sanon) అందంతో, అభినయంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పై ఇప్పటికే ఎన్నో ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా ప్రభాస్ తో ఈమె ఏకంగా పెళ్లికి కూడా సిద్ధమైందని వార్తలు రాగా ఆ వార్తలను ఖండించింది. ప్రభాస్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయింది.
బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన కృతి..
ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ అయిన ఈమె బ్రిటన్ కి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియా (Kabeer Bahia)తో డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు పెద్ద ఎత్తున షికారు చేస్తున్న నేపథ్యంలో..ఈ జంట విహారయాత్ర నుంచి ఒక అందమైన ఫోటోని కూడా పంచుకున్నారు. కొన్ని నెలలుగా వీరి సాన్నిహిత్యంపై నిరంతరం వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వార్తలను ఎవరు అధికారికంగా ధృవీకరించలేదు. అలాగని కొట్టిపారేయలేదు కూడా.. అయితే ఎట్టకేలకు కబీర్ బాహియా ఫ్యామిలీలో పెళ్లికి హాజరై తన రిలేషన్షిప్ ను కృతి ఖరారు చేసిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ముఖ్యంగా కృతి సనన్ తన ప్రియుడితో రెగ్యులర్ గా టచ్ లో ఉందట. ఇన్స్టా లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఊహాగానాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు పెళ్లిలో కృతి సందడి చూస్తే మాత్రం ఈ జంట మధ్య విషయం మరింత ముదిరిందనే వార్తలను మీడియా ప్రచురిస్తోంది. ఇక వీళ్లిద్దరూ ఇప్పటికైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ పెళ్లిలో కృతి సనన్ ఎంతో స్టైలిష్ గా కనిపించింది. స్పెక్స్ ధరించిన ఈమె భారతీయ వస్త్రధారణలో అద్భుతంగా ఆకట్టుకుంది.మొత్తానికి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
కృతి సనన్ కెరియర్..
ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఎప్పుడూ కూడా మీడియాకు చిక్కకుండా దాచుతూ వస్తోంది. తన కెరీర్ పైన ఎక్కువగా దృష్టి పెట్టిన ఈమె ఇటీవల మిమీ అనే సినిమాలో నటించి, తన నటనతో జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతురాలిగా పేరు దక్కించుకున్న ఈమె సడన్గా కబీర్ బాహియా కుటుంబ సభ్యులతో కనిపించడంతో నిజంగానే అతడితో డేటింగ్ చేస్తోందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి. ఇకపోతే కృతి సనం ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు నిర్మాతగా కూడా చలామణి అవుతుంది. క్రూ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని దోపట్టీ అనే సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మించింది. ఇక అలా హీరోయిన్ గా,నిర్మాతగా కూడా చలామణి అవుతోంది ఈ ముద్దుగుమ్మ.