E-Paper
Advertisement

HCA Probe: ప్రస్తుత పాలకవర్గానికి TG20 నిర్వహించే అర్హత లేదు: హైకోర్టు సంచలనం!

HCA Probe: ప్రస్తుత పాలకవర్గానికి TG20 నిర్వహించే అర్హత లేదు: హైకోర్టు సంచలనం!
Advertisement

HCA Probe: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్సీఏ)కు శుక్రవారం డబుల్​ షాక్​ తగిలింది. హెచ్​సీఏ అక్రమాలపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదికను అంద చేయాలంటూ జస్టిస్​ రాజశేఖర్​ రెడ్డి నేతృత్వంలోని లోకాయుక్త సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ క్రికెట్​ అసోసియేషన్​ (టీసీఏ)కు చెందిన క్రికెటర్లు గౌరవ్​ శర్మ, మహేందర్​ రెడ్డిలు హెచ్సీఏ నిర్వహించాలనుకుంటున్న టీజీ20 టోర్నీ చట్టబద్దతను సవాల్​ చేస్తూ హైకోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ లీగ్ ను నిర్వహించే అధికారం ప్రస్తుత పాలక వర్గానికి లేదని అందులో పేర్కొన్నారు.

అవినీతి ఆరోపణలు..

హెచ్​సీపై ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సీఐడీ వింగ్ ఏర్పాటు చేసిన సిట్​ విచారణ జరుపుతోంది. కాగా, హెచ్​సీఏపై ఉన్న ఆరోపణలకు సంబంధించి లోకాయుక్తకు నాలుగు ఫిర్యాదులు అందాయి. వీటిని విచారణకు తీసుకున్నలోకాయుక్త నాలుగు ఫిర్యాదులపై దర్యాప్తును నాలుగు వారాల్లో పూర్తి చేసి పూర్తి స్థాయి యాక్షన్​ టేకెన్ రిపోర్టులు, ప్రాసిక్యూషన్​ నివేదికలు, సంబంధిత రికార్డులను సమర్పించాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు గతంలో నమోదైన కేసు (ఎఫ్​ఐఆర్​ నెంబర్​ 02/2025) దర్యాప్తును కూడా నాలుగు వారాల్లో పూర్తి చేసి చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక, హెచ్​సీఏ కూడా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికలను లోకాయుక్తకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేస్తూ ఆదేశాలను అమలు చేయటంలో విఫలమైతే సంబంధిత అధికారులపైచర్యలు తప్పవని స్పష్టం చేసింది.

Advertisement

Also read: Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..

హైకోర్టులో రిట్​ పిటిషన్లు..

ఇదిలా ఉండగా టీసీఏకు చెందిన క్రికెటర్లు గౌరవ్​ శర్మ, మహేందర్​ రెడ్డిలు హైకోర్టులో రిట్​ పిటిషన్లు దాఖలు చేశారు. హెచ్‌సీఏ ప్రతిపాదించిన టీజీ20 లీగ్ చట్టబద్ధత, ప్రస్తుత పాలకవర్గానికి ఆ లీగ్ నిర్వహించే అధికారాన్ని సవాల్ చేశారు. హెచ్​సీఏలో జరిగిన వివాదాస్పద నియామకాలు, ఇచ్చిన అనుమతులు, తీసుకున్న పరిపాలనా నిర్ణయాలు, పాలనా ప్రక్రియలపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరారు. తుది తీర్పు వెలువడే వరకు టీజీ2‌‌0 టోర్నీని జరపకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. లేనిపక్షంలో సరిదిద్దుకోలేని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలియచేశారు.

Advertisement

Also read: ఇద్దరు యువకులకు పెళ్లి చేసిన ఒడిశా వాసులు.. పాతికేళ్ల తర్వాత మళ్లీ, ఎందుకంటే?

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×