E-Paper

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!
Advertisement

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం సిరికొండ మండ‌లం పున్నా గ్రామంలో పాండురంగా అనే రైతు ఆత్మ‌హ‌త్య రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ఇవాళ కేటీఆర్ త‌న బీఆరెస్‌తో టీమ్‌తో క‌లిసి ఆ రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డం.. దీంట్లో ప‌లు రైతు ఇష్యూల‌ను, స‌ర్కార్ వైఖ‌రిని గురించి మాట్లాడిన మాట‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ఇందులో ప్ర‌ధానంగా రైతుబీమా ప‌థ‌కాన్ని రేవంత్ స‌ర్కార్ అట‌కెక్కించ‌ద‌నే అంశం…ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఈ విష‌యం రైతు వ‌ర్గంలో గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనికి త‌గ్గ‌ట్టు.. బీఆరెస్ కూడా దీన్ని ప్ర‌ధాన లోపంగా స‌ర్కార్ వైఖ‌రినిపై మండిప‌డుతూ వ‌స్తోంది. తాజాగా పాండురంగ ఆత్మ‌హత్య ఉదంతం రైతుబీమా విష‌యంలో స‌ర్కార్ వేసిన రాంగ్ స్టెప్‌గా ఎక్కువ ఫోక‌స్‌లోకి వ‌చ్చింది.

Advertisement

రైతుబీమాకు సంబంధించి మొత్తాన్ని బీమా ప్రీమియం కోసం చెల్లించాల్సి ఉంది. దీన్ని ఆది నుంచి స‌ర్కార్ చెల్లించ‌డం లేదు. నిధుల లేమీ అనే కార‌ణంతో పాటు.. కేసీఆర్ మార్కు ప‌థ‌కాల‌పై రేవంత్ స‌ర్కార్ మొద‌ట నుంచి లైట్‌గానే తీసుకుంటోంది. అందుకే దీన్ని అట‌కెక్కించారు. దీనికి బ‌దులుగా ప్ర‌తి ఇంటికీ ఐదు ల‌క్ష‌ల బీమా చేపించే ప‌థ‌క‌మొక‌టి తెస్తామ‌ని ప్ర‌క‌టించినా.. అదింకా కార్య‌రూపం దాల్చ‌లేదు. కానీ, ఈ విష‌య‌న్ని మాత్రం బీఆరెస్ రాజ‌కీయం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది.

వాస్త‌వానికి, రైతుబీమా వ‌ల్ల బాధిత రైతు కుటుంబాల‌కు పెద్ద ఆస‌రాగానే నిలిచింద‌ని చెప్పాలి. ఏదేని కార‌ణాల చేత రైతు చ‌నిపోతే.. ఆ కుటుంబానికి ఐదు ల‌క్ష‌ల ఆర్థిక సాయం ఎంతో బాస‌ట‌గా నిలిచేది.ఈ ప‌రిణామాలు ఎటు దారి తీస్తున్నాయంటే.. కాంగ్రెస్ స‌ర్కార్ వచ్చిన త‌రువాత ఎంత మంది రైతులు చ‌నిపోయారో లెక్క‌లు బ‌య‌ట‌పెట్టేంత వ‌ర‌కు. రైతు వ్య‌తిరేక చ‌ర్య‌ల వ‌ల్లే రైతులు బ‌ల‌న్మ‌ర‌ణాలు పొందుతున్నార‌ని, అలా చ‌నిపోయి అనాథ‌లుగా మారిన కుటుంబాల‌కు దిక్కులేకుండా పోయింద‌ని, రైతు బీమా అమ‌ల‌య్యే స‌మ‌యంలో ఎంతో కొంత వారికి ఊట‌ర‌నిచ్చేద‌ని బీఆరెస్ నేత‌లు చెప్పుకుంటున్నారు.

Advertisement

రైతులోకానికి ఇది బాగా క‌నెక్ట‌వుతోంది. ఇప్ప‌టికే స‌ర్కార్ విధానాల‌పై, రెండున్న‌రేండ్ల పాల‌న‌లో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, చెప్పిన హామీల‌న్నీ అమ‌లు కాలేవ‌నే కోపం ఉంది. రైతు వ్య‌తిరేక‌త క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోందనే విష‌యం కూడా స‌ర్కార్ గ‌మ‌నిస్తోంది. కానీ దాన్ని త‌గ్గించుకునేందుకు.. మాత్రం పెద్ద ప్ర‌య‌త్నాలు ఏమీ జ‌రుగుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

తాజాగా రైతు బీమాపై బీఆరెస్ ఒత్తిడి పెంచుతోంది. పాండురంగ కుటుంబానికి మూడు ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేసిన కేటీఆర్.. ఆ బాధిత కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని, వారి ఇంట్లో ఒక‌రికి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. దీన్ని మ‌రింత‌గా రాజ‌కీయంగా వాడుకునేందుకు బీఆరెస్ రెడీ అయ్యింది. కాంగ్రెస్ ఈ విష‌యంలో సెల్ప్ గోల్ అవుతోంది.

Related News

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

దేశం కోసం.. దేశ స‌మైక్య‌త కోసం.. దేశ ద్రోహం..! ఎవ‌రి వాద‌న రైటు..! ఎవ‌రు క‌రెక్టు..?

వ‌రి విచ్చ‌ల‌విడిగా వేసుకోండి..! బీఆరెస్ స్టాండ్ ఏమిటీ? రైతుల‌ను రెచ్చ‌గొట్టేందుకేనా?

Big Stories

×