E-Paper
Advertisement

Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..

Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..
Advertisement

Bandla Ganesh : టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్‌పై ఆయనకున్న అభిమానం. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన నా దేవుడు అని ప్రస్తావిస్తాడు.. సాధారణంగా హీరోలపై నిర్మాతలు అభిమానం చూపిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ పై మాత్రం బండ్ల గణేష్ దైవ భక్తిని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ భక్తుడని మరోసారి నిరూపించుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ను పరామర్శించాడు.. అంతేకాదు తన దేవుడు అభిమాని కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రస్తుతం ఇది అటు రాజకీయాల్లోను, ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. దాంతో పవన్ అభిమానులు బండ్లన్న పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

పవన్ అభిమానికి బండ్ల ఆర్థిక సాయం..

వరంగల్ హన్మకొండలోని హనుమాన్ నగర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాడు. అతన్ని పవన్ కళ్యాణ్ కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నిర్మాత బండ్లన్న హన్మకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి అతని ఆరోగ్యం గురించి పూర్తి వివరాలను తల్లి, దండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరంజన్ కు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాదు తనవంతు సాయంగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్పమనసు చాటుకున్నాడు.. పవన్ కళ్యాణ్ భక్తుడు అని నిరూపించుకున్నాడు బండ్ల. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. నిజంగానే భక్తుడని అనిపించుకున్నావు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే..

Advertisement

చిన్నారి నిరంజన్ ను పరామర్శించిన బండ్ల గణేష్ అతని కోరికను తెలుసుకున్నాడు.. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంజన్ కు కారులో ఎక్కాలన్న కోరిక ఉందని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరి హృదయాలు బరివెక్కిపోయాయి. త్వరలోనే ఆ కోరిక కూడా తీర్చే అవకాశాలు ఉన్నట్లు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. నా దేవుడు పవన్ కళ్యాణ్ నిరంజన్ నీ పరామర్శించిన రోజే ఇది నా దృష్టికి వచ్చింది అని బండ్ల అన్నారు. నా కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్లే ఈ చిన్నారిని చూడలేకపోయాను అని చెప్పుకొచ్చారు.. ఇక్కడికి నేను కేవలం బాలుడు నిరంజన్ ని పరామర్శించడానికి మాత్రమే వచ్చాను.. ఎటువంటి రాజకీయాల గురించి మాట్లాడను అని బండ్ల గణేష్ తెలిపారు. ఈ చిన్నారి నిరంజన్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.. ఈయన నిరంజన్ ని కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమాలుకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.. అంతేకాదు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారన్న విషయం తెలిసిందే..

Related News

డైలాగ్ చేంజెస్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు.. రన్ టైమ్ లాక్!

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

Big Stories

Advertisement
×