BigTV English

HCU : 2వేల ఎకరాలు మాయం.. చివరికి మిగిలింది ఇదే.. షాకింగ్ నిజాలు

HCU : 2వేల ఎకరాలు మాయం.. చివరికి మిగిలింది ఇదే.. షాకింగ్ నిజాలు

HCU : కంచె గచ్చిబౌలి భూములు. కాదు కాదు HCU భూములు. ఆ 400 ఎకరాలపై ఎవరి వాదన వారిదే. ఇన్నాళ్లూ తమ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఆ భూమి తమదే అనేది సెంట్రల్ యూనివర్సిటీ మాట. లీగల్‌గా ఆ ల్యాండ్ గవర్నమెంట్‌దేనని సర్కారు వాదన. ఇంతకీ ఆ భూమి ఎవరిది? HCUకి అసలు ఎంత స్థలం ఉంది? మొదట్లో ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత మిగిలింది? ఇన్నేళ్లలో ఎన్ని వేల ఎకరాలు చేతులు మారాయి? ఈ 400 ఎకరాల కోసమే ఎందుకింత గొడవ జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ లెక్కలు బయటకు వచ్చాయి. ఆ నిజాలు చాలా చేదుగా ఉన్నాయి. సుమారు 2వేల 700 ఎకరాలతో మొదలైన సెంట్రల్ యూనివర్సిటీ.. 50 ఏళ్లు గడిచే సరికి కేవలం 484 ఎకరాలకే పరిమితమైంది. అంటే సుమారు 2వేల ఎకరాల భూమి HCU నుంచి వేరు వేరు సంస్థలకు బదలాయించారంటే నమ్మాల్సిందే.


HCU భూముల లెక్క ఇదే..

1975లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటైన నాడు.. 2324.05 ఎకరాల భూమిని కేటాయించారు. చాలాకాలం తర్వాత 2004లో మరో 397.16 ఎకరాలు అదనంగా ఇచ్చారు. ఈ మధ్యలో అనేక మలుపులు, ట్విస్టులు కూడా ఉన్నాయి. మొత్తం ల్యాండ్‌లో 105 ఎకరాల్లో చెరువులు, కుంటలు ఉన్నాయి. మరో 400 ఎకరాల భూమి రాళ్లమయం. 255 ఎకరాలు పచ్చని చెట్లతో గ్రీన్ బఫర్ ఏరియాగా ఉంది. 200 ఎకరాల గుండా హైటెన్షన్ కరెంట్ వైర్లు వెళ్తున్నాయి. ఇక, రోడ్లు, నడకదారులకు ఇంకో 65 ఎకరాలు పోయింది. ఈ లెక్కన.. ఎలాంటి నిర్మాణాలు లేకుండా మిగిలిన భూమి విస్తీర్ణం.. 1025 ఎకరాలు.


ఎవరికి ఎంత భూమి ఇచ్చారంటే..

ఈ HCU భూముల నుంచి వివిధ సందర్భాల్లో.. వివిధ ప్రభుత్వాల హయాంలో.. వివిధ సంస్థలకు స్థలాలు ధారాదత్తం చేశారు. స్థానిక MRO ఆఫీస్ కోసం 5 ఎకరాలు ఇచ్చారు. త్రిబుల్ ఐటీ కోసం 62 ఎకరాలు కేటాయించారు. SAAP నేషనల్ గేమ్స్ కోసం 108 ఎకరాలు కట్టబెట్టారు. SAAP మిలటరీ గేమ్స్ కోసం మరో 13 ఎకరాలు, SAAP హాకీ స్టేడియం కోసం ఇంకో 14 ఎకరాలు ఇచ్చేశారు. జవహార్ నవోదయ విద్యాలయం కోసం 30 ఎకరాల భూమిని, సీఆర్ రావ్ ఇన్‌స్టిట్యూషన్‌కు 5 ఎకరాలు, ఏపీట్రాన్స్‌కోకు 5 ఎకరాలు, ఏపీఎస్‌ఆర్టీసీకి సుమారు 10 ఎకరాలు, ఏపీఎన్జీవోస్ ఇళ్ల స్థలాల కోసం మరో 134 ఎకరాలు.. NIAB సంస్థకు 100 ఎకరాలు.. ఇలా పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు HCU భూములను భారీగానే కట్టబెట్టారు. అదే కోవలో.. బిల్లీ రావుకు చెందిన IMG Bharat అనే ప్రైవేట్ సంస్థకు సైతం 400 ఎకరాల స్థలం అప్పగించారు. ఈ భూమి పైనే ప్రస్తుతం గొడవ జరుగుతోంది. ఇలా 1975 నుంచి 2025 వరకు మొత్తంగా 1212.13 ఎకరాల యూనివర్సిటీ భూమిని వేరు వేరు యాజమాన్యాలకు బదిలీ చేశారు.

Also Read : ఇది రేవంత్ బ్రాండ్.. ఎట్టా ఉంటాదో తెలుసా..

చివరికి మిగిలింది కొంతే..

ఇలా అచ్చంగా HCUకు కేటాయించిన మొత్తం భూమి 2721.21 ఎకరాలు. ఇందులో చెరువులు, రాళ్లు, వైర్లు, రోడ్లు కోసం మినహాయించిన భూమి 1025 ఎకరాలు. వివిధ సంస్థలకు కేటాయించిన ల్యాండ్ మరో 1212.13 ఎకరాలు. ఇదంతా తీసేస్తే.. ఈ రోజుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ప్రస్తుతం మిగిలి ఉన్న భూమి.. కేవలం 484.04 ఎకరాలు మాత్రమే. ఇదీ లెక్క.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×