Rain Alert: తెలంగాణలో రాబోయే కొన్ని గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.
మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు రాత్రి కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించింది.
మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల్లో మరో 2 గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
రేపు ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం
రేపు నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 27న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ALSO READ: ARMY PUBLIC SCHOOL: డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.52,500 జీతం.. ఇంకెందుకు ఆలస్యం
ఈ 28న ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ నెల 28న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.