Vishnupriya:సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చారు అంటే.. వారితో ఫోటోలు దిగడానికి వారి అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఎగబడుతూ ఉంటారు. పైగా ఎక్కడ కనిపించినా సరే ఆ ప్రదేశం గురించి పట్టించుకోకుండా వారితో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక సెలబ్రిటీలు కూడా ఎవరు అడిగినా ఫోటోలు సంతోషంగా ఇస్తారు. ఎందుకంటే సెలబ్రిటీలు ఫోటోలు ఇవ్వకపోతే అభిమానులు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వారికి ఈగో అంటూ వారిపై లేనిపోని విమర్శలు గుప్పిస్తారు. ఆ భయంతోనే కొంతమంది అభిమానులు ఫోటో అడిగితే ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడరు. అయితే యాంకర్ విష్ణుప్రియ మాత్రం ఎంతటి వారైనా ఫోటో అడిగితే ఎవ్వరికీ ఇవ్వదు. ఆమె ఫ్యాన్స్ వచ్చి అడిగినా సరే ఫోటో ఇవ్వడానికి ఆమె కాస్త ఆలోచిస్తుంది. ఇప్పటికే ఈమెపై చాలా విమర్శలు వస్తున్నాయి. అందుకే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు ప్రియా కి ఇదే ప్రశ్న ఎదురవగా దానికి ఆమె సమాధానం తెలిపింది.
అందుకే ఫోటో దిగాలంటే భయం – విష్ణు ప్రియ
విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి ఎవరితో అయినా ఫోటో దిగాలి అంటే ఇష్టం ఉండేది కాదు. అలాగే ఎవరికైనా ఫోటో ఇవ్వాలి అని కూడా నేను అనుకునేదాన్ని కాదు. ఇక బిగ్ బాస్ లో గెలిస్తే అందరికీ ఫోటోలు ఇవ్వాలేమో అనే భయం వేసింది. ముఖ్యంగా ఒకరితో ఫోటో దిగడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను తెరపై కనిపించినంత వరకు.. వారు నన్ను చూస్తున్నంత వరకు ఓకే.. అంతవరకే నేను, ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాను. ఆ తర్వాత మాకు సంబంధం లేదు అనే మెంటాలిటీ నాది. తెలియని వాళ్లకు హాయ్ చెప్పాలన్నా కూడా నాకు కష్టంగా ఉంటుంది నేను చాలా ఇంట్రో వర్ట్. అందుకే ఫోటోలు ఇవ్వను. పార్టీలకు కూడా వెళ్లాలంటే భయం వేస్తుంది. అక్కడికి వెళ్తే కొత్త వాళ్లను కలవాలి.అలాంటి ఎన్నో భయాలు నన్ను చుట్టూ ముడుతాయి..
సెల్ఫీ అడిగితే పట్టరాని కోపం వస్తుంది – విష్ణుప్రియ
అంతెందుకు మా బంధువులలో కూడా నేనంటూ ఉన్నానని ఎవరికీ తెలియదు. మా అమ్మకి మా చెల్లి ఒక్కతే కూతురు అనుకుంటారు. వర్క్ లేకపోతే ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడైనా ప్రశాంతత కోసం గుడికి వెళ్తే అక్కడ ఫోటోలు అడుగుతారు. కోపం వస్తుంది. గుడికి దేవుడి కోసం వస్తే ఫోటోల కోసం అభిమానులు అడుగుతారు.దేవుడిని వదిలేసి వీళ్ళ కోసం ఫోటోలు ఇవ్వడం తప్పు కదా.. దేవుడు ముందు మనమెంత. ఇక సాధ్యమైనంత వరకు నేను ఫోటో ఇవ్వను.. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తే.. నా బాడీ లాంగ్వేజ్ అలాగే ఫేస్ లో ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది అంటూ తన ఫీలింగ్స్ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విష్ణు ప్రియ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అలరిస్తోంది.
ALSO READ:AA 22×A6 Movie : అల్లు అర్జున్ మూవీలో ఐదో హీరోయిన్ గా నాని బ్యూటీ… ఏకంగా అలాంటి పాత్రలో..!