BigTV English

Rains in Telangana: రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు

Rains in Telangana: రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.


ఇవాళ్టి నుంచి రేపటి వరకు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీయవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: N Convention: నాగార్జున వర్సెస్ హైడ్రా.. ఎవరేమంటున్నారు? ఏం జరిగింది?


ఇక రేపటి నుంచి ఎల్లుండి వరకు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు కూడా వీస్తాయని వివరించింది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో మధ్యాహ్నం పూట తీవ్ర స్థాయిలో ఎండలు కాయగా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు దంచికొట్టాయి. కొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత రాజధాని నగరంలో వర్షాలు కాస్త వెనుకపట్టు పట్టాయి. గత వారంలో జిల్లాల్లోనూ పుష్కలంగా వర్షం పడింది. కొన్ని చోట్ల రికార్డు స్థాయిల్లో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×