BigTV English

Chaturgrahi Yog 2024: చతుర్గాహి యోగం.. ఈ రాశుల వారి జీవితాలు మారిపోతాయ్

Chaturgrahi Yog 2024: చతుర్గాహి యోగం.. ఈ రాశుల వారి జీవితాలు మారిపోతాయ్

Chaturgrahi Yog 2024:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశులపై ఇవి శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తాయి. సెప్టెంబర్ 2024లో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకమైందిగా పరిగణిస్తారు. ఈ మాసంలో కన్య రాశిలో గ్రహాల జాతర జరగనుంది. దీని కారణంగా శుభ, అశుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కలుగుతాయి.


మరి కొన్ని రాశుల వారి జీవితాల్లో విపరీతమైన మార్పులు కలుగుతాయి. దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్‌లో నెలలో సెప్టెంబర్ 4 వ తేదీన గ్రహాల రాజు బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబరు 23న కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు.

సెప్టెంబర్ 16 న సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఆగస్టు 25 నుంచి కన్యా రాశిలోనే ఉంటున్నాడు. సెప్టెంబరు 18 వరకు ఈ రాశిలో సంచరిస్తాడు. అంతుచిక్కని గ్రహంగా పిలువబడే బుధుడు 2023 నుంచి కన్య రాశిలోనే ఉన్నాడు. ఈ సంవత్సరం తన రాశిని మార్చుకోనున్నాడు. శుక్ర, బుధ, సూర్య కేతువుల రాకతో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు అద్భుత ప్రయోజనాలను పొందనున్నారు.


కొన్ని రాశుల వారికి సెప్టెంబర్ నెల జీవితంలో కొత్త సానుకూల మార్పులను కలిగిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితం వికసిస్తుంది. కన్య రాశిలో చతుర్గాహి యోగం ఏ రాశుల వారికి అదృష్టం తెచ్చి పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
ఈ రాశివారు చతుర్గాహి యోగం వల్ల సెప్టెంబర్ నుంచి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవితంలో ఆనందం, సుఖాలు పెరుగుతాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పూర్వీకుల ద్వారా ఆస్తి, ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త జాబ్ ఆఫర్లను పొందుతారు.

సింహరాశి:
చతుర్గాహి యోగం వల్ల సింహ రాశి వారి జీవితాల్లో అద్భుత మార్పులు వస్తాయి. ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం కలుగుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సామాజిక హోదా, ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.

కన్య రాశి:
చతుర్గాహి యోగం కన్య రాశి వారి జీవితంలో అనేక అద్భుత ఫలితాలను కలిగిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి మీరు రాబడిని పొందేందుకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం, శాంతి పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. వృత్తి సంబంధిత విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. జీవితంలో ఏది కావాలనుకుంటే అది మీకు ఈ సమయంలో దొరుకుతుంది. మీ కలలు నిజం అయ్యేందుకు ఇది మంచి సమయం.

ధనస్సు రాశి:
సెప్టెంబర్ నుంచి ధనస్సు రాశి వారికి ఆగిపోయిన పనులన్నీ పున ప్రారంభం చేసేందుకు అవకాశం ఉంది. మీ కలలన్నీ నిజం అయ్యేందుకు ఇది మంచి సమయం. కెరీర్‌లో గొప్ప అవకాశాలు అందుకుంటారు. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. విదేశాల్లో పనిచేయడానికి ఆఫర్లు పొందుతారు. భాగస్వామ్య జీవితం కూడా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. సోదర సోదరీమణులతో మీ సంబంధాలు పెరుగుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×