Rain Alert: ఉదయం నార్మల్. మధ్యామ్నం మీడియం. సాయంత్రం దుమ్ము దుమ్ము. ప్రజెంట్ తెలంగాణ స్టేట్ వైడ్‌గా ఉన్న రెయిన్ సిచ్యువేషన్ దాదాపు ఇదే. ఉపరితల చక్రవాత ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇందుకు ఎండల తీవ్రత కూడా ఒక కారణమేనంటున్న వాతావరణ శాఖ అధికారులు..
తెలంగాణలో మరో మూడు రోజులు వానలే వానలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ- కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి..
దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించిందని తెలిపారు. మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాల నుంచి పశ్చిమ-మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణశాఖ వారు వివరించారు.
ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..
తెలంగాణలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఏపీలో మరో 4 రోజులు భారీ వర్షాలు..
ఏపీలో వచ్చే 4 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఇటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..
గురువారం హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో భారీ వర్షం గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా కుండపోత వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లు నీట మునిగాయి. యూసుఫ్గూడ, కృష్ణా నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, టోలీచౌకి, గచ్చిబౌలి తో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షం పడింది. చాలాసేపు రోడ్లు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
Also Read: ఎవడు ఎక్కడైనా బతకొచ్చు! మార్వాడీ గో బ్యాక్ పై మైనంపల్లి షాకింగ్ రియాక్షన్
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మూడు రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే కుంభవృష్టిగా పడుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నా యని, అత్యసరమైతేనే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరు తున్న ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, వెంటనే స్పందించాలని తెలిపారు. మ్యాన్ హోల్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకో వాలని జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.