Mohammad Nabi 5 Sixes :ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న రాత్రి శ్రీలంక వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే టాస్ గెలిచిన అప్గానిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకంది. ఈ మ్యాచ్ ప్రారంభంలో అప్గానిస్తాన్ జట్టు మెల్లగా ఆడినప్పటికీ.. చివర్లో అప్గాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో 5 సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో మొత్తం నో బాల్ తో కలిపి 32 పరుగులు రావడం విశేషం. శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే 32 పరుగులు ఇచ్చానని బాధపడుతున్న క్షణాల వ్యవధిలోనే మరో విషాదం సంఘటన చోటు చేసుకుంది. సురంగ వెల్లలాగే గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించాడు.
Also Read : AFG Vs SL : ఆసియా కప్ లో శ్రీలంక ఘన విజయం.. అప్గాన్ ఔట్..!
ఈ మ్యాచ్ లో సిక్సర్లు కొట్టిన తర్వాత.. శ్రీలంక బౌలర్ తండ్రి చనిపోయాడు. తన కుమారుడి బౌలింగ్ లో మహ్మద్ నబీ 5 సిక్సర్లు కొట్టాడని తట్టు కోలేక గుండె ఆగి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నీలో గ్రూపు బీ నుంచి శ్రీలంక-బంగ్లాదేశ్ సూపర్ 4 కి అర్హత సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కీలక మ్యాచ్ లో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో అప్గానిస్తాన్ పై విజయం సాధించింది. ఈ గ్రూపు లో మూడు విజయాలతో శ్రీలంక టాప్ ప్లేస్ లో ఉండగా.. రెండు విజయాలతో బంగ్లాదేశ్ టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతోంది. దీంతో అప్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్ -4 కి అర్హత చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు సాధించింది. దీంతో ఆ జట్టు విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు.
Also Read : Fastest Fifty : ఎవడ్రా వీడు…13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. జస్ట్ మిస్… యువీ రికార్డ్ గంగలో కలిసేది !
ముఖ్యంగా అప్గానిస్తాన్ బ్యాటర్ మహ్మద్ నబి 22 బంతుల్లో 60 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెలలాగే వేసిన చివరి ఓవర్ లో నబీ ఏకంగా 5 సిక్స్ లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లలో అతను వరుసగా6, 6,6, నోబాల్, 6, 6 బాదాడు. ఇతర బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 74 నాటౌట్. అర్థ సెంచరీతో జట్టును గెలిపించగా.. కుశాల్ పెరీరా(28), కమిందు మెండిస్ (26) రాణించాడు. శనివారం జరిగే తొలి సూపర్ 4 మ్యాచ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి.
40-YEAR-OLD MOHAMMED NABI SMASHED 6,6,6,6,6 IN THE FINAL OVER 😍 pic.twitter.com/ycxbKOANn1
— Johns. (@CricCrazyJohns) September 18, 2025