BigTV English

TG Weather: అలర్ట్.. తెలంగాణకు భారీ వర్షసూచన

TG Weather: అలర్ట్.. తెలంగాణకు భారీ వర్షసూచన

Heavy Rains Alert for Telangana: తెలంగాణలో వాతావరణం భిన్నంగా ఉంటోంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పగలంతా ఎండకాచి.. సాయంత్రమయ్యేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. అక్కడక్కడా చిరుజల్లులు, అర్థరాత్రివేళ వర్షాలు కురుస్తున్నాయి. మళ్లీ ఉదయాన్నే సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. ఒక్కోరోజైతే.. అసలిది వర్షాకాలమే అనేలా ఉంటోంది ఎండ.


తాజాగా తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబరు 2 వరకూ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Also Read: హైదరాబాద్.. రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్.. తుపాకీతో కాల్పులు..


పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గత మంగళవారం (ఆగస్టు 20) కురిసిన అతి భారీవర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. రోడ్లన్నీ చెరువులను తలపించగా.. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. వరదనీటిలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి బైక్ తో సహా వర్షపు నీటిలో కొట్టుకుపోయాడు. ఆ వీడియో నెట్టింట వైరలైంది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కురిసిన వర్షాన్ని చూసిన ప్రజలు.. ఇదేం వర్షమని భయపడ్డారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×