BigTV English

Hyderabad firing: హైదరాబాద్.. రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్.. తుపాకీతో కాల్పులు..

Hyderabad firing: హైదరాబాద్.. రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్.. తుపాకీతో కాల్పులు..

Hyderabad firing: హైదరాబాద్‌లో మిడ్ నైట్ కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు గ్రూపుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం గాలివానగా మారింది. ఈ క్రమంలో ఓ గ్రూప్‌పై మరొక గ్రూపుకి చెందిన వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి బీఆర్ఎస్‌ కార్యకర్తగా అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం..


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. అందులో ఓ మహిళ  కూడా ఉంది. రాత్రి గాజుల రామారం వద్ద ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బైక్‌లో ఆయిల్ ఐపోవడంతో  ఆగిపోయింది. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి బార్ వద్ద పార్కింగ్ చేసిన వాహనం వద్దకు వచ్చిన పెట్రోల్ తీశాడు. దీన్ని గమనించిన బార్‌కి చెందిన వ్యక్తి వారితో గొడవకు దిగాడు. అయితే బైక్‌పై ఉన్న మహిళ తన భర్తకు ఫోన్ చేయడంతో ముగ్గురు వ్యక్తులను తీసుకుని అక్కడికి చేరుకున్నాడు.

ఈ క్రమంలో చిన్నపాటి గొడవ జరిగింది. మహిళా భర్త అనుచరుల్లో ఒకరు తన వద్దనున్న గన్ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. బార్ క్యాషియర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అదే సమయంలో బార్ ఓనర్ అక్కడికి చేరుకున్నాడు. ఆయనను తార్ వాహనంతో ఢీ కొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బార్ క్యాషియర్.. సైలెంట్‌గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చేసరికి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు, వారి మద్దతుదారులు అక్కడి నుంచి పారిపోయారు.


ALSO READ: ఎంఐఎం పై మాధవీ లత ఫైర్..బలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు

ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.  కాల్పులు జరిపిన వ్యక్తి బీఆర్ఎస్‌‌కు చెందిన కార్యకర్త అని తెలుస్తోంది.  పోలీసుల విచారణపై అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. కావాలనే నిందితులను పట్టుకుని వదిలేశారని అంటున్నారు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×