Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చే తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ సమయంలో వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. శుభమా అంటూ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా, వేణు స్వామి మరోవైపు వారు విడిపోతారంటూ కామెంట్స్ చేశారు. దీనితో వేణు పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కమిషన్ ముందు వేణు స్వామి హాజరుకావాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. మిషన్ కు ఆ అధికారం లేదంటూ హైకోర్టుకు వెళ్లి వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సంధర్భంగా ఆ స్టే ఎత్తివేస్తూ, కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. అలాగే వారం రోజుల్లో వేణుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషన్ ను న్యాయస్థానం ఆదేశించింది.
ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి తెలియని వారుండరు. ఏదో ఒక వివాదంలో వేణుస్వామి పేరు ఎప్పుడూ వినిపించడం పరిపాటి. కాగా వేణుస్వామి చెంతకు ఎందరో తమ జాతకం తెలుసుకొనేందుకు ఎందరో వస్తుంటారు. వారికి జ్యోతిష్యం చెప్పడమే కాక, పలువురు ప్రముఖులకు స్వతహాగా జ్యోతిష్యం చెబుతూ వీడియోలు విడుదల చేయడం, వివాదాస్పదంగా మారిన ఘటనలు కోకొల్లలు.
అంతేకాదు ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్వామి బల్లగుద్ది చెప్పారు. అలాగే టీడీపీకి పూర్వవైభవం లేదని కూడా పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ కూడా చేశారు. అయితే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం ఆ విషయంలో రివర్స్ అయింది. ఇక అంతే సోషల్ మీడియాలో స్వామిపై ఊహించని రీతిలో ట్రోలింగ్స్ వచ్చాయి. తాను చెప్పింది జరగకపోగా, టీడీపీకి ఏకంగా 164 సీట్లు రావడంతో ఇక ముందెన్నడూ, తాను రాజకీయాల జ్యోతిష్యం చెప్పనని స్వామి ప్రకటించారు.
ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ నిశ్చయమైంది. ఓ వైపు అక్కినేని వారి ఇంట సందడి సందడిగా ఉంది. వేణుస్వామి ఒక్కసారిగా తన మాటలతో తూటాలు వదిలారు. నాగ చైతన్య రెండవ వివాహం కూడా కలిసి రాదని, విడిపోవడం ఖాయం అంటూ వీడియో విడుదల చేశారు. అసలు ఎవరూ అడగలేదు, ఎవరూ ఆయనను సంప్రదించలేదు.. జస్ట్ ఒక్క వీడియో వదిలారు. ఇక అంతే టాలీవుడ్ భగ్గుమంది. అలాగే ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా టాలీవుడ్ కి మద్దతు తెలిపారు.
Also Read: Telangana Wife Kill Husband: హైదరాబాద్‌లో మర్డర్.. కర్ణాటకలో శవం.. భారీ స్కెచ్!
అనంతరం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు వెంటనే వేణుస్వామి పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనితో వెంటనే కమిషన్ ముందు స్వామి హాజరు కావాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించగా, స్వామి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ నిర్వహించిన న్యాయస్థానం, వేణుస్వామి వాదనను తోసిపుచ్చి, వారం రోజుల్లో వేణుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషన్ ను ఆదేశించింది.