BigTV English

HMDA Clarification : అనధికారిక ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హెచ్ఎండీఏ క్లారిటీ.. అవి తమ ఆదేశాలు కావని వెల్లడి

HMDA Clarification : అనధికారిక ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హెచ్ఎండీఏ క్లారిటీ.. అవి తమ ఆదేశాలు కావని వెల్లడి

HMDA Clarification :హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలోని గ్రామ అనధికారిక లేఔట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు కొన్ని రోజులుగా మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థిరపడాలనుకునే సామాన్య ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై హెచ్ఎమ్ డీఏ క్లారిటీ ఇచ్చింది.


వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో శివారు ప్రాంతాలు.. మధ్య తరగతి, సామాన్య ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. నగరంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే కాస్త అందుబాటు ధరల్లోనే ప్లాట్లు  అందుబాటులో ఉండడంతో చాలా మంది ఇక్కడ స్థిరపడాలని కోరుకుంటుంటారు. అందుకే.. తమకు అనుకూలంగా ఉన్న పరిసర గ్రామాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే, ఆర్థిక స్థోమత వచ్చినప్పుడు ఇళ్లు నిర్మించుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ .. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారనే వార్తలు ఆందోళనల్ని కలిగించాయి.

కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్ని ఖండించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ .. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. ఏడాదిగా హెచ్ఎండీఏ పరిధిలోని అనధికారిక లేఔట్లల్లోని ప్లాట్లలో రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థన చేయలేదని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారక లే అవుట్ల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, రిజిస్ట్రేషన్ల అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది.


ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా.. మూసీ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది అంటూ ప్రచారం చేసిన కొంత మంది, అదే తరహాలో ఎలాంటి ఉత్తర్వులు వెలువడని అంశాన్ని తెరపైకి తీాసుకువచ్చి ప్రచారం చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటివన్నీ.. రాజకీయ లబ్ధి కోసం చేసే పనులే తప్పా, అందులో వాస్తవం లేదని అంటున్నారు. నిత్యం.. కొత్త ప్రాంతాల్ని తనలో ఇముడ్చుకుంటూ.. విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి నియంత్రించడం, అడ్డుకోవడం ఎవరి వల్లా కాదంటున్న రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు.. శివారు ప్రాంతాలు క్రమక్రమగా నగరంలో భాగంగ కావడం ఎప్పటి నుంచో జరుతోందని అంటున్నారు.

హెచ్ఎండీఏ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. కొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఆ వార్తలు అసత్యమని, నిరాధారమైనవన తేల్చింది. అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించింది.

Also Read : టపాసులతో బైక్ స్టంట్స్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో.. వారిని ఏం చేశారో తెలుసా?

సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు వారి స్థోమతకు తగ్గ ప్రాంతాల్లోని భూములపై పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటి వారిని అనుమానులకు గురిచేసి, శివారు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవడమే ఇలాంటి ప్రచారాల లక్ష్యమంటున్నారు.. విశ్లేషకులు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×