BigTV English

CM Revanth Reddy: చూస్తూ కూర్చుంటారా? ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy: చూస్తూ కూర్చుంటారా? ఎమ్మెల్యేలకు రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy: గవర్నర్ ప్రసంగం సమయంలో BRS నేతలు నిరసనలు చేస్తుంటే అడ్డుకోకుండా ఏం చేస్తున్నారంటూ..? ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ను గవర్నర్ ప్రసంగంలో చెబుతుంటే.. బీఆర్ఎస్ కుట్రలు చేసిందని, ఆ కుట్రలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఎందుకు వ్యవహరించడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీ హాల్‌లో కాంగ్రెస్ శాసన సభాపక్ష మీటింగ్‌‌లో చాలా మంది నేతలపై సీఎం క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ విప్ లు తమ పని తీరును మార్చుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్లు లేవా? అంటూ విప్ లను సీఎం నిలదీశారు. ఈ బడ్జెట్ సెషన్స్ లో యాక్ట్ గా ఉండాలని సూచించారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎటాక్ చేసేందుకు రెడీగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన ప్రతీ అంశాన్ని కార్నర్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన డేటా, సబ్జెక్ట్ ను తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. అంశాన్ని బట్టి కౌంటర్లు ఇవ్వాలన్నారు. బడ్జెట్ సెషన్స్ లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతాయని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం.

బడ్జెట్ సెషన్స్ లో అసెంబ్లీలో మూడుసార్లు అటెండెన్స్ వేయనున్నారు. ప్రభుత్వ విప్ లు రోజులో మూడుసార్లు సభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎవరు ఎటు వెళ్లారు? అనే వివరాలను సేకరించనున్నారు. పార్లమెంట్ సెషన్స్ లో ఇలాంటి ఆనవాయితీ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు అవుతారని ప్రభుత్వం నమ్మకం. ప్రస్తుతం సీఎం సభలో లేకపోతే చాలా మంది ఎమ్మెల్యేలు సభకు హాజరుకావడం లేదని స్వయంగా మంత్రులే ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. ఈ కొత్త విధానంతో అలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు.


బడ్జెట్ సెషన్స్ పూర్తి కాగానే సీఎం అన్ని జిల్లాలకు టూర్ కు వెళ్లనున్నారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించనున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరును పర్యవేక్షించనున్నారు. స్థానిక ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ప్రభుత్వ పనితీరు, పాలసీ నిర్ణయాలు వంటి విషయాలను చర్చించనున్నారు. ఇక ఎమ్మెల్యేలు నేరుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాల్సిందేనని సీఎం సూచించారు. అప్పుడు ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి ఆశించిన స్థాయిలోకి వెళ్తుందన్నారు.

Also Read: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, ఫారెన్ మంత్రితో భేటీ వెనుక

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ తో కార్డియల్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేయాలనుకుంటున్నారా? అని సీఎం ప్రశ్నించారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ పెట్టదని భావిస్తున్నారా? అంటూ సీఎం నిలదీశారు. ఎమ్మెల్యేలు వ్యవహార శైలీ మార్చుకోవాలని సూచించారు. లేకుంటే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×