E-Paper
Advertisement

Weather Report: ఎండ-వాన.. కాక్‌టైల్ వెదర్..

Weather Report: ఎండ-వాన.. కాక్‌టైల్ వెదర్..
Advertisement
weather report

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రాంతంలో ఎండలు బెంబేలెత్తిస్తుంటే..మరో ఏరియాలో మాత్రం వానలు పడుతున్నాయి. నిన్నటి వరకు ఏపీ, తెలంగాణలో ఎండలు కాకపుట్టించాయి. రికార్డు స్థాయిలో 41డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల దాటికి ప్రజలు అల్లాడిపోయారు. భయటికి రావాలంటేనే భయపడిపోయారు.

ఐతే శుక్రవారం ఒక్కసారిగా తెలంగాణలో వాతావరణంలో మార్పు కనిపించింది. గురువారం రాత్రి మెదక్ జిల్లాలో రాళ్లవాన పడింది. శుక్రవారం తెల్లవారు జూము నుంచే హైద్రాబాద్‌లో పలు చోట్ల వానలు పడ్డాయి. నిన్నటి వరకు నిప్పులు చిమ్మిన ఆకాశం.. ఒక్కసారిగా మేఘావృతం అయింది. ఎండ వేడిమికి అల్లాడిన నగర వాసులకు వాన చినుకులతో కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు. ఈ నెల 16వ తేదీ వరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు.

Advertisement

తెలంగాణలో ఇలా ఉంటే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నిప్పుల కుంపటిలా మారిన ఎండతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉక్కపోత చంపేస్తుంది. శుక్రవారం 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు ఉన్నాయి. శనివారం 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×