E-Paper
Advertisement

మండే ఎండల్లోనూ కుంకుమ పువ్వు సాగు.. తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం

మండే ఎండల్లోనూ కుంకుమ పువ్వు సాగు.. తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం
Advertisement

Saffron Farming: తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. సాధారణంగా చలిగాలులు, మంచు కురిసే కశ్మీర్ లోయల్లో మాత్రమే పండే కుంకుమ పువ్వు.. ఇప్పుడు మన తెలంగాణ గడ్డపై, అదీ భానుడి భగభగలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వనపర్తి జిల్లాలో నవ్వులు పూయిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం! తెలంగాణ వాతావరణంలో కుంకుమ పువ్వు పండించడమా? అసాధ్యం అన్న అంచనాలను పటాపంచలు చేస్తూ మన శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించారు.

ల్యాబ్‌లో కశ్మీర్ క్లైమేట్.. సరికొత్త ప్రయోగం
వనపర్తిలోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అసాధారాణ విజయానికి నాంది పలికారు. నాబార్డు ఆర్థిక సహాయంతో, ప్రొఫెసర్ పిడిగం సైదయ్య నేతృత్వంలోని బృందం ఈ ప్రయోగాత్మక పంటను విజయవంతంగా సాగు చేస్తోంది. ఇందుకోసం వారు ఎంచుకున్నది మట్టితో పనిలేని ఏరోపోనిక్స్ అనే అత్యాధునిక సాంకేతిక విధానం. కేవలం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక యంత్రాల సాయంతో ల్యాబ్‌లోనే కశ్మీర్ తరహా శీతల వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. పంట ఎదుగుదలకు అనుగుణంగా రాత్రి, పగలు వేర్వేరు ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ ఈ అద్భుతాన్ని సాధించారు.

Advertisement

బంగారంతో సమానమైన పంట..
మార్కెట్లో కుంకుమ పువ్వు ధర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్రాముల్లోనే దీని ధర వేలల్లో పలుకుతుంది. అందుకే దీనిని ‘రెడ్ గోల్డ్’ అని పిలుస్తుంటారు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే కుంకుమ పువ్వు సాగు ద్వారా రైతులు కళ్లు చెదిరే లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. తక్కువ స్థలంలో, పరిమిత వనరులతోనే నియంత్రిత వాతావరణంలో ఈ పంటను పండించవచ్చని వనపర్తి శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, రాబోయే రోజుల్లో మన రైతుల ఆర్థిక రాత మారడం ఖాయంగా కనిపిస్తోంది.

రైతులకు త్వరలోనే ప్రత్యేక శిక్షణ..
ఈ వినూత్న సాగు విధానాన్ని కేవలం పరిశోధనా ల్యాబ్‌లకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు యూనివర్సిటీ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసక్తి గల రైతులకు కుంకుమ పువ్వు సాగుపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి అధికారికంగా వెల్లడించారు. సాంకేతికతను వాడుకుంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా పొందాలో రైతులకు వివరించనున్నారు.

Advertisement

తెలంగాణ అగ్రి-టెక్ విజయం.. శాస్త్రవేత్తలకు హ్యాట్సాఫ్!
ఎండలు, అకాల వర్షాలతో సవాలుగా మారిన తెలంగాణ వాతావరణంలో ఇలాంటి ఒక వాణిజ్య పంటను పండించడం సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రయోగం గనుక పూర్తిస్థాయిలో సక్సెస్ అయి, సామాన్య రైతులకు అందుబాటులోకి వస్తే తెలంగాణ వ్యవసాయ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, అన్నదాతల ఆశలకు కొత్త రెక్కలు తొడిగిన మన కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల శాస్త్రవేత్తల ప్రతిభకు నిజంగానే ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే.

Also Read: దారుణం.. కారుకు అడ్డంగా నిలబడ్డాడని యూ టర్న్ తీసుకుని వ‌చ్చి మరీ కారుతో ఢీకొట్టి హత్య

Related News

కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. నెక్ట్స్ ప్లాన్?

హిమాలయాల్లో పగిలిన మంచు కొండ.. 2,500 మందికి పైగా గల్లంతు!

పుంగనూరులో టీడీపీ ఇంచార్జి మార్పు కలకలం.. వేదికపైనే కన్నీటి పర్యంతమైన చల్లా బాబు!

రాఖీ పండుగకు వచ్చి.. శవమైన హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనర్!

బెల్లంపల్లి మున్సిపాలిటీలో పనిచేయని చెత్త ట్రాలీలు.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్ జిల్లాలో గజదొంగలు హల్‌చల్.. జంకుతున్న స్థానికులు!

కరువు నేలకు కృష్ణా జలాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మారనున్న రూపురేఖలు!

అక్రమ బంధం పెట్టిన ఘోర వినాశనం.. ఇంటిపై పెట్రోల్ పోసిన బాధితులు!

Big Stories

Advertisement
×