E-Paper
Advertisement

రిస్ట్‌పై స్మార్ట్‌ఫోన్.. 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరాతో అదిరిపోయే 4G స్మార్ట్‌వాచ్!

రిస్ట్‌పై స్మార్ట్‌ఫోన్.. 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరాతో అదిరిపోయే 4G స్మార్ట్‌వాచ్!
Advertisement

NovaWatch Rotatecam 4G: టెక్నాలజీ రోజు రోజుకూ స్మార్ట్‌గా మారిపోతోంది. ఒకప్పుడు కేవలం టైమ్ చూడటానికి, ఫిట్‌నెస్ ట్రాక్ చేయడానికి వాడిన స్మార్ట్‌వాచ్‌లు.. ఇప్పుడు ఏకంగా.. స్మార్ట్‌ఫోన్లనే రీప్లేస్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ట్రెండ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ మార్కెట్లోకి వచ్చింది “Ai+ నోవావాచ్ రొటేట్‌కామ్ 4G ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్” (Ai+ NovaWatch Rotatecam 4G). ఇందులో ఇచ్చిన 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా గ్యాడ్జెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని పూర్తి ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వాచ్ కేవలం బ్లూటూత్ కాలింగ్ డివైజ్ మాత్రమే కాదు, ఇదొక పూర్తి స్థాయి 4G ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్. అంటే.. ఇందులో మీరు నేరుగా 4G సిమ్ కార్డ్ వేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే.. నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవ్వడం వల్ల గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫేవరెట్ యాప్స్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా:
ఈ వాచ్‌లో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. ఇందులోని 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా. దీని సహాయంతో మీరు చేతికి వాచ్ పెట్టుకునే అద్భుతమైన సెల్ఫీలు దిగవచ్చు. అలాగే కెమెరాను జస్ట్ అలా పైకి తిప్పి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలా మార్చుకుని డైరెక్ట్ గా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. రీల్స్, షార్ట్ వీడియోలు తీసే వారికి , క్విక్ స్నాప్స్ ఇష్టపడే వారికి ఈ ఫీచర్ ఒక అద్భుతం అని చెప్పాలి.

డిస్‌ప్లే అండ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్:
Ai+ నోవావాచ్ రొటేట్‌కామ్ పెద్ద, బ్రైట్ స్క్రీన్‌తో వస్తుంది. దీని వల్ల ఎండలో కూడా డిస్‌ప్లే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మెసేజ్‌లు చదవడం, టైప్ చేయడం చాలా ఈజీ. హెవీ టాస్క్‌లను స్మూత్‌గా రన్ చేయడానికి ఇందులో పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు మంచి ర్యామ్ (RAM),ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. కాబట్టి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి ల్యాగ్ లేదా హ్యాంగింగ్ సమస్యలు ఉండవు.

Advertisement

ఫిట్‌నెస్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్:
స్మార్ట్ ఫీచర్లతో పాటు మీ ఆరోగ్యాన్ని కనిపెట్టుకోవడానికి.. ఇందులో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ , స్టెప్ కౌంటర్ వంటి అన్ని అవసరమైన హెల్త్ సెన్సార్లు ఇందులో ఇన్-బిల్ట్ గా వస్తాయి. రోజువారీ యాక్టివిటీలను ట్రాక్ చేయడానికి ఇది పర్ఫెక్ట్‌గా హెల్ప్ చేస్తుంది.

ధర ఎంత?
ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న Ai+ నోవావాచ్ రొటేట్‌కామ్ 4G ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ ప్రస్తుత మార్కెట్ ధర కేవలం రూ.6,999 గా ఉంది. రూ.7 వేల లోపు బడ్జెట్‌లో.. స్మార్ట్‌ఫోన్ లాంటి ఫీచర్లు, కెమెరా , 4G కనెక్టివిటీ కావాలనుకునే స్టూడెంట్స్, టెక్ ప్రియులకు ఇది ఒక వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.

ముఖ్య గమనిక: ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లభించే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, సేల్స్ సీజన్‌ను బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొనే ముందు ఒకసారి లేటెస్ట్ డీల్స్ చెక్ చేసుకోవడం బెటర్.

Tags

Related News

ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నారా? మీ ఫోన్ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే!

కేవలం రూ. 411 కే బ్లూటూత్ ఇయర్‌బడ్స్.. డోంట్ మిస్

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇంట్లోనే.. 50 ఇంచుల టీవీ రూ. 27వేలకే !

జేబులో ఇమిడిపోయే సౌండ్ బాంబ్.. కేవలం రూ.799 కే

రూ. 8 వేల లోపు బెస్ట్ కార్ డ్యాష్‌క్యామ్.. నైట్‌పల్స్ విజన్, జీపీఎస్ టెక్నాలజీతో!

లాగ్స్ లేవు.. స్లో అవ్వవు.. సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఎస్‌ఎస్‌డీ లాప్‌టాప్స్!

ఐరన్ బాక్స్‌లకు గుడ్ బై..బట్టల ముడతలను చిటికెలో పోగొట్టే 5 బెస్ట్ గార్మెంట్ స్టీమర్స్!

Big Stories

Advertisement
×