E-Paper
Advertisement

Vote From Home : ఇంటి నుంచే ఓటు.. ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి ?

Vote From Home : ఇంటి నుంచే ఓటు.. ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి ?
Advertisement
Vote From Home

Vote From Home : తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. Election Commission ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు EC ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో తొలిసారి వృద్ధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌కు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలను చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో ఈ ఇయర్ మేలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కల్పించింది.

ఈ సౌకర్యం యూజ్ చేసుకోడానికి వృద్ధులలో 80 ఏళ్లు దాటి ఉండాలి.తాజాగా విడుదల చేసి తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్లు 4.43 లక్షలు ఉన్నారు. వందేళ్లు పైబడిన వారు 7,689 మంది ఉన్నారు. ఇక డిజేబుల్డ్ పర్సన్స్ విషయానికి వస్తే 40 శతం కంటే ఎక్కువ డీసెబిలిటీ ఉంటేనే దీనికి అర్హులు. తెలంగాణలో డిజేబుల్డ్ ఓటర్లు 5.06 లక్షల మంది ఉన్నారు.

Advertisement

ఈ ఫ్లెక్సిబిలిటీ ను ఉపయోగించుకోవాలనుకునే అర్హులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ‘ఫార్మ్ 12డి’ ఫిల్ చేయాలి. ఫార్మ్ 12డీ’ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫార్మ్ నింపి రిటర్నింగ్ అధికారికి కానీ, సహాయ రిటర్నింగ్ ఆఫీసర్ కి కానీ పంపించాలి.

అప్పిలికేషన్స్ ను చెక్ చేసిన తరువాత అర్హతను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారు. అర్హత ఉంటే వారి ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. పోలింగ్ సెంటర్ కి వచ్చి ఓట్ వేసేటప్పుడు ఎలా అయితే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచే ఓటు వేసేటప్పుడు అలానే ఉండేలా ఆఫీసర్స్ అన్ని యాక్షన్స్ తీసుకుంటారు. ఓటు వేయడం మానేయకుండా, అందరు యూజ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా సదుపాయాలను అందిస్తుంది. ఈ దేశ పౌరుడిగా ఓటు అనేది మన బాధ్యత మాత్రమే కాదు హక్కు..

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×