BigTV English

Dharma Sandehalu: జ్ఞానసాధనలో గురువు అవసరం ..!

Dharma Sandehalu: జ్ఞానసాధనలో గురువు అవసరం ..!

Dharma Sandehalu: ఏదైనా ఒక కొత్త చోటికి వెళ్లాలంటే అడ్రస్ వెళతాం. ఇంకా ఏదైనా అనుమానం వస్తే.. అక్కడి వారిని అడుగుతూ మనం వెళ్లాల్సిన చోటికి వెళుతుంటాం. ఈ పనిచేయకపోతే.. అడ్రస్ ఏదో తెలిసినా.. సులభంగా అక్కడికి చేరుకోలేము.
అలాగే.. జ్ఞాన సాధన చేసేవారికీ గురువు అవసరం ఎంతో ఉంటుంది. సాధన మొదలుపెట్టిన శిష్యుడి మనసులోని అనుమానాలను, అజ్ఞానాన్ని గురువు తొలగించి, అతడు లక్ష్యం దిశగా సాగేలా గురువు మార్గదర్శనం చేస్తాడు.
గురువు లేకుండా సాధనచేస్తే దారి తప్పే ప్రమాదముంది.
నిజానికి.. మనిషి జీవితం దుఃఖమయం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం మూలంగా.. ‘అయ్యో.. గత జన్మలో ఏ పుణ్యమూ చేయకపోతినే’ అని దుఃఖిస్తాడు.
పుట్టిన క్షణం నుంచి ‘పూర్వ జ్ఞానం పోయిందే’ అని కొన్నాళ్లు.. తర్వాత తల్లిపాల కోసం ఏడుస్తాడు. బాల్యంలో చదువు ఒత్తిడి, సామాజిక ఒత్తిళ్లకు గురవుతుంటాడు.
యవ్వనం రాగానే ఆకర్షణ మొదలై, ప్రేమ కోసం దుఃఖిస్తాడు. చదువు కాగానే ఉద్యోగం రాలేదని, చేస్తున్నది బాగాలేదని, ఒకవేళ బాగుంటే.. తాను ఆశించిన విజయం పొందటం లేదని ఏడుస్తుంటాడు.
ఇక.. పెళ్ళి కాగానే స్వేచ్ఛ పోయిందనే ఏడుపు, 40 ఏళ్లకు భార్య, బిడ్డలు తన మాట వినటం లేదని, ఇతరుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నామనే గొడవ ఉండనే ఉంటుంది.
వృద్ధాప్యంలో కుటుంబం తనను పట్టించుకోవటం లేదనే ఆవేదన. సరిగ్గా అప్పుడే.. మనసు భౌతిక విషయాల నుంచి పరమాత్మ వైపుకి మొగ్గుతుంది. అప్పుడు మనసుకు శాంతి, తృప్తి లభిస్తాయి.
ఇన్నాళ్ళు ‘నేను’, ‘నాది’ అనుకున్నదంతా నిజంకాదని తెలుసుకుని, తనలోనే పరమాత్మను వెతికే ప్రయత్నం చేస్తుంటాడు.
సరిగ్గా ఈ సమయంలోనే గురువు అవసరం ఉంటుంది. మనసుకు అంటిన బంధాలను తెంచి, మోక్షం వైపుకు శిష్యుడు ఎలా నడవాలో గురువు బోధిస్తాడు. గురువు అసలైన ప్రయోజనం ఇదే!


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×