
Huzurabad: హుజూరాబాద్ నియోకవర్గ బీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గొంతెత్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న కౌశిక్ రెడ్డి ఇతర నేతలను గుర్తించడం లేదంటూ ఆరోపించారు జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి. ఈ విషయాలన్ని సీఎం కేసీఆర్‌కు వివరిస్తూ లెటర్ రాశారు.
నియోజకవర్గం నుంచి 5 బీసీ, ఎస్సీ చైర్మన్లు పదవులు ఉన్నప్పటికీని వారిని నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదని లేఖలో తెలిపారు. గ్రూప్ రాజకీయాలు ఎక్కువవుతున్నాయని.. సీనియర్ నాయకుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు సమ్మిరెడ్డి. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో చీలికలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ దీనిపై స్పందించి స్పెషల్ ఎంక్వయిరీ చేయాలని కోరారు.