Hyderabad Assault Case: అత్యాచారం కేసులో నిందితునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ. 3 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరేళ్ల క్రితం బాధితురాలు ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి కర్మన్ ఘాట్ ప్రాంతంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అద్దెకు దిగింది. 2019 జూలై 28న తెల్లవారుజాము సమయంలో బాధితురాలు వాష్ రూంకు వెళుతుండగా రాజేశ్ ఆమెను బలవంతంగా తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు రాజేశ్ ను నిలదీశారు. దాంతో బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని రాజేశ్ వారిని నమ్మించాడు. ఆ తరువాత వివాహానికి నిరాకరించాడు. దాంతో బాధితురాలు 2019 జూలై 29న సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి కీలక వైద్య ఆధారాలను సేకరించారు. అనంతరం నిందితుడు రాజేశ్ ను అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలతో కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు.
Also Read: పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!
కేసును విచారించిన ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా 13వ అదనపు జిల్లా కోర్టు.. నిందితుడ్ని దోషిగా తేల్చింది. రాజేశ్ కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,100 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, నిందితుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసులను, కోర్టులో బలమైన వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఉన్నతాధికారులు అభినందించారు.
Also Read: ఏపీని చంద్రబాబు 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: బొత్స సత్యనారాయణ