E-Paper
Advertisement

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
Advertisement

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనపై పోటీ చేసి గెలవాలని హరీశ్‌రావు ముఖ్యమంత్రికి బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలను, రాజకీయ వైఖరిని తూర్పారబట్టారు.

పథకాల ఊసే లేదు.. మా పేర్ల జపమే!

Advertisement

సిద్దిపేటలో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై సభ పెట్టిన సీఎం.. ఆ పథకం గురించి ఏమాత్రం మాట్లాడకుండా కేవలం తమను దూషించడానికే సమయం కేటాయించారని హరీశ్‌రావు విమర్శించారు. గంటసేపు సాగిన ప్రసంగంలో కేసీఆర్, కేటీఆర్, తన పేరును ఏకంగా 140 సార్లు ఉచ్చరించారని ఎద్దేవా చేశారు. సభలో రేవంత్ ముఖంలో తీవ్ర నిరాశ, అసహనం స్పష్టంగా కనిపించాయన్నారు. తనను తాటిచెట్టుతో పోల్చిన సీఎం, గన్నేరు చెట్టులా విషపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం..

Advertisement

కేవలం బహిరంగ సభల్లో అబద్ధాలు చెప్పడం కాదని.. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టి మైక్ కట్ చేయకుండా సమయం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహాన్ని సభ సాక్షిగా, ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ అంటూ సీఎం పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

సొంత పార్టీలోనే అసమ్మతి..

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలలోనూ తీవ్ర వ్యతిరేకత మొదలైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అవినీతి గురించి, పాలన బాగోలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్వయంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. కుట్రలు చేయడం తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రేవంత్‌కు లేదని, అందుకే పలువురు నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటిందని, రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read: నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

Tags

Related News

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్.. జూబ్లీహిల్స్‌లో ఘటన, ఎవరా వ్యక్తి?

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

ఏసీబీ వలలో చిక్కిన టోలీ చౌక్ సీఐ.. ఎలా పట్టుకున్నారంటే?

డిసెంబర్ 1 నుంచి వారికి బాధ్యతలు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ!

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బావోద్వేగం!

Big Stories

Advertisement
×