E-Paper
Advertisement

పోలీస్ శాఖ ప్రక్షాళనపై డీజీపీ ఫోకస్.. 2 వేల హోంగార్డుల నియామకంపై కీలక చర్చ!

పోలీస్ శాఖ ప్రక్షాళనపై డీజీపీ ఫోకస్.. 2 వేల హోంగార్డుల నియామకంపై కీలక చర్చ!
Advertisement

CV Anand: తెలంగాణ పోలీస్ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా డీజీపీ సీవీ ఆనంద్ అడుగులు వేస్తున్నారు. శాఖాపరమైన ప్రక్షాళన, సిబ్బంది సంక్షేమం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ‘మినీ స్టాఫ్ ఆఫీసర్స్’ సమావేశం జరిగింది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే పలు కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

2 వేల హోంగార్డుల నియామకంపై కసరత్తు

Advertisement

రాష్ట్రంలో పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమావేశం ద్వారా ఒక శుభవార్త అందింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల మంది హోంగార్డుల నియామకం చేపట్టే అంశంపై డీజీపీ ఉన్నతాధికారులతో లోతుగా సమాలోచనలు జరిపారు. త్వరలోనే హోంగార్డుల నియామక నోటిఫికేషన్ విడుదల చేసే సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అంతేకాకుండా, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖలో మంజూరైన సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపైనా సమీక్ష నిర్వహించారు.

కొత్త మాన్యువల్, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమం

Advertisement

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ‘తెలంగాణ పోలీస్ మాన్యువల్’ను విడుదల చేసే అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. విధుల్లో ఉన్న వారితో పాటు పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సిబ్బంది నైపుణ్యాలను పెంచేందుకు వార్షిక శిక్షణ క్యాలెండర్‌ను రూపొందించడంతో పాటు, కనుమరుగవుతున్న పోలీస్ బ్రాస్, పైప్ బ్యాండ్లను తిరిగి పునరుద్ధరించాలని సమావేశంలో తీర్మానించారు.

వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్.. అధికారులకు డెడ్‌లైన్లు

రాబోయే రోజుల్లో నిర్వహించాల్సిన ప్రధాన కార్యక్రమాలపై డీజీపీ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్ నిర్వహణతో పాటు మహిళా పోలీసు అధికారుల సదస్సు, రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో చర్చించిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి అధికారులకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించిన సీవీ ఆనంద్, నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: రూ.7.8 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్.. స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ!

Tags

Related News

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్.. జూబ్లీహిల్స్‌లో ఘటన, ఎవరా వ్యక్తి?

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

ఏసీబీ వలలో చిక్కిన టోలీ చౌక్ సీఐ.. ఎలా పట్టుకున్నారంటే?

డిసెంబర్ 1 నుంచి వారికి బాధ్యతలు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×