E-Paper
Advertisement

తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీం షాక్.. బియ్యం ఇస్తారా, బకాయిలు కడతారా?

తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీం షాక్.. బియ్యం ఇస్తారా, బకాయిలు కడతారా?
Advertisement

Rice Millers: ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ మిల్లర్లు చేసిన ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది.

విత్‌డ్రా చేసుకున్న న్యాయవాదులు

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై పోలీసులు ఇప్పటికే 540 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ మిల్లర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సందర్భంగా న్యాయస్థానం నుంచి వ్యతిరేకత రావడంతో.. కోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్ల తరఫు న్యాయవాదులు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.

రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు

Advertisement

లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డిఫాల్ట్ మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న బియ్యాన్ని తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే అందుకు సమానమైన బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో కేసుల విచారణకు మార్గం సుగమం కాగా.. బకాయిలు చెల్లించని మిల్లర్లపై ‘రెవెన్యూ రికవరీ యాక్ట్’ కింద ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read: ఏపీని చంద్రబాబు 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: బొత్స సత్యనారాయణ

Tags

Related News

చుక్కా రామయ్య శతజయంతి.. విద్యా వ్యవస్థకు, తెలంగాణకు గొప్ప పర్వదినం: సీఎం రేవంత్ రెడ్డి

పోలీస్ శాఖ ప్రక్షాళనపై డీజీపీ ఫోకస్.. 2 వేల హోంగార్డుల నియామకంపై కీలక చర్చ!

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్.. జూబ్లీహిల్స్‌లో ఘటన, ఎవరా వ్యక్తి?

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

Big Stories

Advertisement
×