E-Paper
Advertisement

ఏపీని చంద్రబాబు 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: బొత్స సత్యనారాయణ

ఏపీని చంద్రబాబు 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: బొత్స సత్యనారాయణ
Advertisement

Botsa Satyanarayana: ఏపీలో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. విజయనగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మళ్లీ 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారని ధ్వజమెత్తారు.

అధికార పార్టీ దౌర్జన్యాలు.. గవర్నర్‌కు ఫిర్యాదు

Advertisement

డిజిటల్ విప్లవం పేరుతో అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాల్సిన చోట బాంబులతో భయభ్రాంతులకు గురిచేయడం హేయమని బొత్స మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఎక్కడైనా ఘర్షణలు జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేసేందుకు రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆయన వెల్లడించారు.

పూసపాటిరేగ ఎన్నికల్లో అధికారుల పక్షపాతం

Advertisement

పూసపాటిరేగ ఎంపీపీ ఎన్నికల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బొత్స ఆరోపించారు. ‘మా ఎంపీటీసీ సభ్యులకు మధ్యాహ్నం 1 గంటకు రమ్మని చెప్పి, లెటర్‌లో మాత్రం 3 గంటలకు అని రాశారు. తీరా రాత్రి 9 గంటలకు మా సభ్యుడి ఇంటి గోడకు నోటీసులు అంటించి.. సమావేశానికి హాజరు కాలేదని ఎన్నిక చెల్లదనడం ఎంతవరకు సమంజసం?’ అని నిలదీశారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరూ వెళ్లకూడదనే నిబంధన ఉన్నా, స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త లోపలికి వెళ్లి రిటర్నింగ్ అధికారిపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. వెంటనే పూసపాటిరేగ ఎంపీపీ ఎన్నికను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

జడ్పీ పీఠం, ట్రోలింగ్‌పై లోకేష్‌కు కౌంటర్

బీసీ మహిళకు కేటాయించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని ఓసీకి కట్టబెట్టడం బీసీలపై చంద్రబాబు చేస్తున్న కుట్ర అని బొత్స విమర్శించారు. ఈ అంశంపై తమ పోరాటం ఆగదని, ఆమె ఎంతో కాలం ఆ పదవిలో ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, తన కుమార్తెతో పాటు జగన్ కుటుంబంపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తన తల్లిపై కామెంట్స్ వస్తే గగ్గోలు పెట్టిన మంత్రి లోకేష్, నేడు మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని బొత్స దుయ్యబట్టారు.

Also Read: చుక్కా రామయ్య శతజయంతి.. విద్యా వ్యవస్థకు, తెలంగాణకు గొప్ప పర్వదినం: సీఎం రేవంత్ రెడ్డి

Tags

Related News

బద్వేల్ ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం.. ఆఫీస్ గదిలో 12 అడుగుల గుంత తవ్వి..

రూ.7.8 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్.. స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ!

తాడిపత్రిలో కవ్వింపు చర్యలు.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, భారీగా బలగాలు మోహరింపు

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

అక్వాన్ తుఫాన్ తీరం దాటిందో‌చ్.. ఏపీకి పెద్ద గండం తప్పింది, కుమ్మేస్తున్న భారీ వర్షాలు

‘బిగ్‌ టీవీ’ ముందే చెప్పింది.. జెడ్పీ పీఠాలపై లిస్టు ఇదిగో, ఎవరు ఎక్కడెక్కడంటే..

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!

Big Stories

Advertisement
×