E-Paper
Advertisement

దమ్ముంటే హైదరాబాద్‌లో ఓవైసీపై పోటీ చేయి.. అమిత్ షాకు రేవంత్ సవాల్

దమ్ముంటే హైదరాబాద్‌లో ఓవైసీపై పోటీ చేయి.. అమిత్ షాకు రేవంత్ సవాల్
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర ప్రభుత్వ తీరు, ప్రతిపక్షాలపై ఆయన ఘాటుగా స్పందించారు.

డీలిమిటేషన్‌పై దక్షిణాది ఆందోళన

Advertisement

లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత పూర్తిగా దెబ్బతింటుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ, యూపీ సీట్ల మధ్య వ్యత్యాసం 60 నుంచి 90కి పెరుగుతుందని, 850 సీట్లలో ఉత్తరాదికే 650 సీట్లు దక్కితే ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాదిని పట్టించుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దీన్ని ఏ ఒక్క పార్టీ సమస్యగా కాకుండా యావత్ దక్షిణాది భవిష్యత్తుకు సవాల్‌గా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణలు అవసరం లేదని, ఉన్న 543 సీట్లలోనే 181 సీట్లను మహిళలకు కేటాయించవచ్చని సూచించారు.

మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శలు

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీని ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్’ గా అభివర్ణిస్తూ.. ఆయన విదేశీ పర్యటనలు, 12 ఏళ్లలో చేసిన రూ. 120 లక్షల కోట్ల అప్పులపై రేవంత్ నిలదీశారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశ నిర్మాణానికి కీలక సంస్థలు, సంస్కరణలు తెచ్చారని, కానీ మోడీ మాత్రం ప్రజల సొమ్మును అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఉనికి లేదని, అమిత్ షాకు ధైర్యముంటే హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్సేనని స్పష్టం చేసిన రేవంత్, కేసీఆర్‌ను ‘రావణాసురుడు’ గా, కేటీఆర్‌ను ‘మేనేజ్‌మెంట్ కోటా’ నేతగా ఎద్దేవా చేశారు. తాను 17 ఏళ్లలో స్వయం శక్తితో ఎదిగానని, కేటీఆర్ తండ్రి అండతో పైకొచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే బీఆర్ఎస్‌ను ఉంచామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని తేల్చిచెప్పారు.

Also Read: తెలంగాణలో భూముల రీ-సర్వేకు రంగం సిద్ధం.. రైతులకు కీలక సూచనలు జారీ!

Tags

Related News

తెలంగాణలో భూముల రీ-సర్వేకు రంగం సిద్ధం.. రైతులకు కీలక సూచనలు జారీ!

తెలంగాణ రైస్ మిల్లర్లకు సుప్రీం షాక్.. బియ్యం ఇస్తారా, బకాయిలు కడతారా?

చుక్కా రామయ్య శతజయంతి.. విద్యా వ్యవస్థకు, తెలంగాణకు గొప్ప పర్వదినం: సీఎం రేవంత్ రెడ్డి

పోలీస్ శాఖ ప్రక్షాళనపై డీజీపీ ఫోకస్.. 2 వేల హోంగార్డుల నియామకంపై కీలక చర్చ!

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్.. జూబ్లీహిల్స్‌లో ఘటన, ఎవరా వ్యక్తి?

Big Stories

Advertisement
×