E-Paper
Advertisement

చుక్కా రామయ్య శతజయంతి.. విద్యా వ్యవస్థకు, తెలంగాణకు గొప్ప పర్వదినం: సీఎం రేవంత్ రెడ్డి

చుక్కా రామయ్య శతజయంతి.. విద్యా వ్యవస్థకు, తెలంగాణకు గొప్ప పర్వదినం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Chukka Ramaiah:  విద్యావేత్తగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి, సామాజిక పరివర్తనకు కృషి చేసిన చుక్కా రామయ్య శతజయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రానికి, విద్యా వ్యవస్థకు ఒక గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్ల నిండు జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆయనకు ముఖ్యమంత్రి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఐఐటీని పరిచయం చేసిన విద్యా దిగ్గజం..

Advertisement

స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు చుక్కా రామయ్య ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం గుర్తు చేశారు. ముఖ్యంగా ఐఐటీ అనే పదాన్ని తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిని ఘనత ఆయనదేనన్నారు. పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, రావి నారయణరెడ్డిల సరసన నిలిచే మహోన్నత వ్యక్తి చుక్కా రామయ్య అని.. తెలంగాణలో ఆయనకు సమకాలికులు ఎవరూ లేరని, ఆయన కాలం, రాజకీయాలకు అతీతుడని సీఎం ప్రశంసించారు.

చట్టసభల్లో ఆయనతో పనిచేయడం నా అదృష్టం..

Advertisement

కేవలం విద్యావేత్తగానే కాకుండా.. శాసనమండలి సభ్యుడిగా చుక్కా రామయ్య తనదైన ముద్ర వేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి మేధావులతో కలిసి చట్టసభల్లో పనిచేయడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేని విషయాన్ని వారు మండలిలో ప్రస్తావించేంత వరకు ఎవరికీ తెలియదని.. వారి చొరవతోనే అప్పటి ప్రభుత్వం దిగొచ్చి కాలేజీలు ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.

నాయకులకు చురకలు.. 

నేటి రాజకీయ నాయకులు కేవలం ఉకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం కాకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని సీఎం హితవు పలికారు. పదునైన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా, పరిష్కార మార్గాలను కూడా సూచించే అరుదైన నాయకుడు చుక్కా రామయ్య అని కొనియాడారు. ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్లే పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని, ఆయన ఆలోచనలు, సలహాల మేరకే తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: బద్వేల్ ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం.. ఆఫీస్ గదిలో 12 అడుగుల గుంత తవ్వి..

Tags

Related News

పోలీస్ శాఖ ప్రక్షాళనపై డీజీపీ ఫోకస్.. 2 వేల హోంగార్డుల నియామకంపై కీలక చర్చ!

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చెయ్.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్

నా యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారం చేస్తే బట్టలు విప్పి నిలబెడతా.. కేటీఆర్‌పై బల్మూరి ఫైర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్.. జూబ్లీహిల్స్‌లో ఘటన, ఎవరా వ్యక్తి?

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

ఏసీబీ వలలో చిక్కిన టోలీ చౌక్ సీఐ.. ఎలా పట్టుకున్నారంటే?

Big Stories

Advertisement
×