E-Paper
Advertisement

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?

నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి అదే కారణమా.. క్రెడిట్ అంతా వాళ్ళదేనా?
Advertisement

Big Tv Kissik Talks: నటరాజ్ మాస్టర్ బుల్లితెరపై పలు డాన్స్ షోలలో పాల్గొంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదే విధంగా డాన్స్ షోలో ఈయన జడ్జిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇలా డాన్స్ మాస్టర్ గా తనకు ఆట కార్యక్రమం ఎంతో ప్రత్యేకమని తాజాగా ఈయన కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో తెలియజేశారు. సాధారణంగా కొరియోగ్రాఫర్లు ఎవరైనా సినిమాలలో అవకాశాలు అందుకని ఇండస్ట్రీలో మంచిగా స్థిరపడాలని కోరుకుంటారు కానీ నటరాజ్ మాస్టర్(Nataraj Master) మాత్రం చాలా విరుద్ధంగా సినిమాలలో కొరియోగ్రఫీ చేసే ప్రయత్నాలు కూడా చేయలేదని తెలుస్తోంది.

సందీప్ మాస్టర్ కు చిరంజీవి సపోర్ట్..

ఇలా నటరాజ్ మాస్టర్ సినిమాలకు కొరియోగ్రఫీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తడంతో ఈయన సమాధానం చెబుతూ.. నాకు ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలకు కొరియోగ్రఫీ చేయడం అంటే ఇష్టం ఉండదని ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. కొంతమంది హీరోలు ఉన్నారని వారికి మాత్రమే కొరియోగ్రఫీ చేసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది కానీ ఇతర హీరోలకు చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్లకి వెళ్తుందని నటరాజ్ మాస్టర్ తెలిపారు. ఇటీవల కాలంలో సందీప్ కూడా డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశాలు అందుకుంటున్నారు. అయితే ఆయనకు చిరంజీవి లాంటి స్టార్ హీరో సపోర్ట్ ఉండటంవల్లే క్రెడిట్ మొత్తం సందీప్ కు వచ్చిందని నటరాజ్ మాస్టర్ తెలిపారు.

బాస్ చేయిపడితే  ఇండస్ట్రీలో సక్సెస్ అయినట్లే…

Advertisement

చిరంజీవి గారు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త వారిని ఎలా పైకి తీసుకురావాలో బాగా తెలుసు ఆయన చేయిపడితే ఎవరైనా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాల్సిందే అని తెలిపారు. అందరి హీరోలు కూడా ప్రోత్సహించరని క్రెడిట్ మొత్తం వారి ఖాతాలోకి వేసుకుంటారని అందుకే తనకు సినిమాలకు కొరియోగ్రఫీ చేయడం ఇష్టం ఉండదని తెలిపారు. ఇటీవల సందీప్ మాస్టర్ ఏసనాగులకట్ట పాట పట్ల వచ్చిన విమర్శలపై కూడా తాజాగా నటరాజ్ మాస్టర్ స్పందించారు. సందీప్ ఇప్పుడిప్పుడే సినిమాలలో కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని అందుకుంటున్నారు ఆయన ముందు ముందు ఇంకా కొన్ని మెలకువలు నేర్చుకొని మంచిగా కొరియోగ్రఫీ చేస్తారని తెలిపారు.

Advertisement

సందీప్ ముందు ముందు నేర్చుకుంటారు అంటే ఇప్పుడు తన కొరియోగ్రఫీ రాదని అర్థం కాదు. ఒకేసారి అంతమంది డాన్సర్లను మెయింటైన్ చేస్తూ అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా కొరియోగ్రఫీ అందించడం అంటే మామూలు విషయం కాదు .అక్కడ పరిస్థితులకు అనుగుణంగానే సందీప్ మాస్టర్(Sandeep Master) కొరియోగ్రఫీ చేసి ఉంటారు తప్ప తనకు డాన్స్ రాదని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ సందీప్ పట్ల వస్తున్నటువంటి విమర్శలపై నటరాజ్ మాస్టర్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Also Read: పిల్లలు లేరంటూ విమర్శలు… ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది: నటరాజ్ మాస్టర్

Related News

పిల్లలు లేరంటూ విమర్శలు… ఆ తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది: నటరాజ్ మాస్టర్

అనిల్ రావిపూడి తప్పు చేశారు..కావాలనే తొక్కేసారు .. ఆ షో పై నటరాజ్ మాస్టర్ ఫైర్

అగ్నిపరీక్ష.. బిందు మాధవి పై నటరాజ్ మాస్టర్ ఫైర్.. ఇంతలా అవమానిస్తారా?

గాడ్ ఫాదర్స్ ఉంటేనే ఇండస్ట్రీలో అవకాశాలు.. లేకుంటే జీరో: నటరాజ్ మాస్టర్

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

Big Stories

Advertisement
×