E-Paper
Advertisement

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!
Advertisement

Fake Call Centre: సైబర్ నేరగాళ్లు సరిహద్దులు దాటి మోసాలకు తెగబడుతున్నారు. అమాయకులను బెదిరించి, కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ ఈడీ అధికారులు రట్టు చేశారు. గత మూడేళ్లుగా అమెరికా పౌరులనే టార్గెట్‌గా చేసుకుని సాగుతున్న ఈ భారీ డిజిటల్ అరెస్ట్ దందాను ఛేదించి, ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నుంచి పాటియాలా వరకు విచారణ

Advertisement

ఈ అంతర్జాతీయ మోసాలకు సూత్రధారి హర్షల్ రావల్ కాగా, అతను ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్‌లతో కలిసి ఈ ఫేక్ కాల్ సెంటర్ నెట్‌వర్క్‌ను నడిపాడు. మొదట హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఈ ముఠా, అక్కడ స్థానిక పోలీసుల దాడులు జరగడంతో పంజాబ్‌లోని పాటియాలాకు మకాం మార్చింది. అక్కడా మరో ఫేక్ కాల్ సెంటర్ తెరిచి, అమెరికా పౌరులకు ఫోన్లు చేస్తూ క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్టుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు.

వందల మ్యూల్ అకౌంట్లు.. హవాలా మార్గాలు

Advertisement

విచారణలో ఈ ముఠా దందాలు చూసి ఈడీ అధికారులే దిగ్భ్రాంతి చెందారు. మోసాల ద్వారా వచ్చిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు నిందితులు వందలాది మ్యూల్ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు. బాధితుల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బు వసూలు చేసి, ఆ తర్వాత హవాలా మార్గాల ద్వారా నగదుగా మార్చుకున్నారు. దాదాపు రూ.400 కోట్ల మేర క్రిప్టో లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.

కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు

పాటియాలాలో పక్కా ప్లాన్‌తో దాడి చేసిన హైదరాబాద్ ఈడీ బృందం, ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి నగరానికి తరలించింది. భారత్‌తో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లోనూ ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. వేలాది మంది అమెరికన్లను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ వెనుక ఉన్న మిగతా ఆర్థిక లావాదేవీలు, మిగిలిన నిందితుల పాత్రపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

Tags

Related News

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ థర్డ్ ఇయర్, వెలుగులోకి షాకింగ్ విషయాలు,

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!

కేటీఆర్ నోటిని ఫినాయిల్‌తో కడగాలి.. అధికారం పోగానే గజ్జె గుర్తుకొచ్చిందా?– మెట్టు సాయికుమార్

గండిపేట కాండ్యూట్‌కు స్పీడ్ రిపేర్లు.. నీటి సరఫరాపై జలమండలి కీలక ఆదేశాలు!

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కవిత కీలక వ్యాఖ్యలు.. మరోసారి గుట్టు బయటకు

హైదరాబాద్‌లో హైడ్రా మెరుపు దాడులు.. రెండు పార్కులు స్వాధీనం.. తెల్లాపూర్‌లో అక్రమ బోర్ల తొలగింపు!

Big Stories

Advertisement
×