E-Paper
Advertisement

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!
Advertisement

Cyber Fraud: హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త దారిన అమాయకులను, వ్యాపారులను ముంచేస్తున్నారు. ముఖం చూపించకుండా, ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడకుండానే లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా కాప్రా ప్రాంతంలో జరిగిన ఓ ఘోరమైన సైబర్ మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు, అతడికి తెలియకుండానే ఏకంగా రూ.30 లక్షలు నక్కేశారు.

హ్యాకింగ్‌తో మొదలైన స్కెచ్

Advertisement

కాప్రాకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు అత్యంత తెలివిగా హ్యాక్ చేశారు. అనంతరం అతడి ప్రొఫైల్ ఫొటో ను దొంగిలించి, వేరొక నంబర్‌తో కొత్త వాట్సప్ ఖాతాను క్రియేట్ చేశారు. వ్యాపారి బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకునే అకౌంటెంట్‌కు ఈ కొత్త నంబర్ నుంచి మెసేజ్ పంపారు. అత్యవసరంగా డబ్బులు కావాలని, ఒక నిర్దిష్ట బ్యాంక్ ఖాతాకు వెంటనే రూ.30 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాలని నమ్మించారు.

అకౌంటెంట్ తొందరపాటు.. తీరా చూస్తే షాక్!

Advertisement

వాట్సప్‌లో ఉన్నది తన యజమాని ఫొటోనే కావడం, సందేశం కూడా ఆయన పంపినట్లే ఉండటంతో అకౌంటెంట్ ఎలాంటి అనుమానం పడలేదు. వెంటనే కేటుగాళ్లు ఇచ్చిన నకిలీ బ్యాంక్ ఖాతాకు రూ.30 లక్షలు జమ చేశాడు. కొంత సమయం తర్వాత అసలు వ్యాపారితో మాట్లాడినప్పుడు కానీ తాను మోసపోయానని అకౌంటెంట్‌కు అర్థం కాలేదు.

కేసు నమోదు..

విషయం తెలుసుకున్న వ్యాపారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ ఆన్‌లైన్ దొంగల మూలాలను వెతికే పనిలో పడ్డారు. పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి వాట్సప్‌లో డబ్బులు కోరుతూ మెసేజ్ వస్తే, ముందుగా కాల్ చేసి నిర్ధారించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుంది రైతుల తిప్పలేంటో!.. కాంగ్రెస్ సర్కార్‌పై బండి సంజయ్ మండిపాటు

Tags

Related News

రైళ్లు ఆపగలరేమో.. ఢిల్లీ రాకుండా ఆపలేరు! మహేష్ కుమార్ గౌడ్ సవాల్

క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుంది రైతుల తిప్పలేంటో!.. కాంగ్రెస్ సర్కార్‌పై బండి సంజయ్ మండిపాటు

రెండేళ్ల కూతుర్ని చంపి.. యువ దంపతుల ఆత్మహత్య, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన, అసలు ఏం జరిగిందంటే..

ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా.. కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ఫైర్!

బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో సంచలనం.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!

ఆధార్ తరహాలో ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్.. ఏ పంటకో తెలుసా..?

Big Stories

Advertisement
×