E-Paper
Advertisement

క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుంది రైతుల తిప్పలేంటో!.. కాంగ్రెస్ సర్కార్‌పై బండి సంజయ్ మండిపాటు

క్షేత్రస్థాయికి వెళ్తే తెలుస్తుంది రైతుల తిప్పలేంటో!.. కాంగ్రెస్ సర్కార్‌పై బండి సంజయ్ మండిపాటు
Advertisement

Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కరువు మండలాల జాబితాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన మండలాలను వదిలేసి, మొక్కుబడిగా ఈ జాబితాను తయారు చేశారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. ప్రభుత్వం అశాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తీవ్ర వివక్ష

Advertisement

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్‌లలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని బండి సంజయ్ గుర్తుచేశారు. దాదాపు -35 శాతం వరకు వర్షపాతం లోటు ఉన్న ప్రాంతాలను కూడా జాబితా నుంచి తప్పించడం వెనుక రాజకీయం ఉందన్నారు. నిధులు కేటాయించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కరీంనగర్‌ను విస్మరించారా అని నిలదీశారు. పొలాలన్నీ బీళ్లుగా మారి, తాగునీటి ఎద్దడి తలెత్తుతున్నా పాలకులకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ డిమాండ్

Advertisement

కరువు మండలాలను ఏ ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేశారో ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి చెందిన వర్షపాతం లోటు, సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల స్థితిగతులు, నేలలో తేమ వివరాలను బహిరంగపరచాలన్నారు. ఒక మండలంలో వర్షం పడితే పక్క మండలంలోనూ పడినట్లే అనుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

రైతులకు న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు

ప్రభుత్వం వెంటనే సర్వే ప్రక్రియను పునఃపరిశీలించి, కరువుతో అల్లాడుతున్న అర్హత గల మండలాలన్నింటినీ జాబితాలో చేర్చాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, పేదలకు ఉపాధి పనులు కల్పించాలని బండి సంజయ్ కోరారు. రైతులు, పేదల పొట్ట కొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: అర్ణబ్ తుఫాన్ బీభత్సం.. ఏలూరు, తీరప్రాంతాలు జలదిగ్బంధం

Tags

Related News

కాప్రాలో సైబర్ కేటుగాళ్ల పంజా.. వ్యాపారి ఫోన్ హ్యాక్ చేసి రూ.30 లక్షలు స్వాహా!

రెండేళ్ల కూతుర్ని చంపి.. యువ దంపతుల ఆత్మహత్య, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన, అసలు ఏం జరిగిందంటే..

ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా.. కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ఫైర్!

బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో సంచలనం.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!

ఆధార్ తరహాలో ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్.. ఏ పంటకో తెలుసా..?

నవంబర్ నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

Big Stories

Advertisement
×