E-Paper
Advertisement

వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాలకు వర్ష సూచన, కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో

వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాలకు వర్ష సూచన, కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో
Advertisement

Weather Alert: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కొద్ది గంటల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా రానున్నట్లు తెలియజేసింది.

వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాలకు వర్ష సూచన

Advertisement

భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. అగ్ని కార్తె కావడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గడిచిన మూడు రోజులు దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు లేదా రేపు కేరళంను రుతుపవనాలు తాకనున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

శనివారం రాత్రి వేళ హైదరాబాద్ సిటీతోపాటు వివిధ జిల్లాల్లో తేలికపాటి చినుకులు పడ్డాయి. అంతేకాదు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో సామాన్యుడు హ్యాపీగా ఫీలవుతున్నాడు. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

 కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వానలు పగనున్నట్లు తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాముందని తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాంటూ ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వర్షం తర్వాత మధ్యాహ్నానికి వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. దాదాపు 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణ పొడిగా ఉంటుంది. సాయంత్రం మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ALSO READ: కేబీఆర్ పార్క్ బయట అగ్నిప్రమాదం.. షాకైన వాకర్స్, ఏం జరిగింది?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×