E-Paper
Advertisement

హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!

హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!
Advertisement

NBFC Cyber Fraud: నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు సాధారణ ప్రజలనే టార్గెట్ చేసిన హ్యాకర్లు, ఇప్పుడు ఏకంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) అకౌంట్లపైనే కన్నువేశారు. డిజిటల్ వ్యవస్థలు, బ్యాంకింగ్ ఛానల్స్‌లోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని.. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే మూడు ప్రముఖ సంస్థల నుంచి ఏకంగా రూ.18 కోట్లకు పైగా నగదును కొల్లగొట్టారు.

గంటల వ్యవధిలోనే కోట్ల మాయం

Advertisement

అక్టోబర్ 19న‘ వివిఫై’ NBFC ఖాతా నుంచి రూ.3.34 కోట్లు మాయం కావడంతో ఈ దోపిడీల పర్వం మొదలైంది. హ్యాకర్లు ఈ మొత్తాన్ని 52 అనుమానాస్పద ఖాతాలకు మళ్లించారు. ఆ వెంటనే నవంబర్ 1న ‘స్పందన స్ఫూర్తి’ సంస్థ ఖాతా నుంచి 82 అనధికార లావాదేవీల ద్వారా రూ.7.80 కోట్లు కాజేశారు. ఇక నవంబర్ 6న ‘కీర్తనా ఫిన్‌సర్వ్’ లక్ష్యంగా జరిగిన దాడి మరింత తీవ్రమైంది. కేవలం ఒకే ఒక్క గంటలో 39 లావాదేవీలు జరిపి రూ.7.09 కోట్లను విభిన్న ఖాతాలకు మళ్లించేశారు.

ఖాతాదారులు, సంస్థల్లో తీవ్ర ఆందోళన

Advertisement

ఈ మూడు దాడుల శైలి చూస్తే సైబర్ క్రిమినల్స్ ఎంత పక్కా ప్రణాళికతో వ్యవహరించారో అర్థమవుతోంది. దొంగిలించిన కోట్ల రూపాయలను వెనువెంటనే వేర్వేరు ‘మ్యూల్ అకౌంట్లకు’ మళ్లించి, ఆపై నగదును సులభంగా డ్రా చేసుకున్నారు. సిస్టమ్‌లో ఉన్న చిన్నచిన్న సెక్యూరిటీ లోపాలను పసిగట్టి, ఇంత పెద్ద మొత్తంలో అనధికార లావాదేవీలు జరుపుతున్నా వెంటనే గుర్తించలేకపోవడం ఆర్థిక రంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

NBFC సంస్థల్లో తీవ్ర భయాందోళనలు

వరుసగా జరుగుతున్న ఈ దాడులతో తోటి NBFC సంస్థల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వరుస సైబర్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేసింది. హ్యాకర్లు వాడిన అకౌంట్లు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా మూలాలను కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Also Read: వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

Tags

Related News

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!

చార్జిషీట్ వేయాంటే రూ.2 లక్షలివ్వాల్సిందే.. ఏసీబీ దాడిలో కీసర ఎస్‌ఐ అరెస్ట్!

రాహుల్ గాంధీని అడ్డుకుంటే జరిగేది ఇదే.. ఢిల్లీ నేతలకు విహెచ్ కౌంటర్!

Big Stories

Advertisement
×