Keesara SI Srinivas: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయాల్సిన రక్షక భటులే లంచాలకు కక్కురుత్తి పడుతూ శాఖ పరువును తీస్తున్నారు. కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారాలు వరుసగా వెలుగుచూస్తుండటం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో అధికారుల అరెస్ట్‌లు మరవకముందే, తాజాగా మరో ఎస్‌ఐ ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.
రూ. 2 లక్షల డిమాండ్..
కీసర పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధి నిర్వహణలో ఉన్న శ్రీనివాస్, ఒక భూమోసం , 498ఏ కేసులకు సంబంధించి కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే, ఈ పని పూర్తి చేయడానికి నిందితుడి నుంచి రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అడిగినంత మొత్తాన్ని చెల్లించకపోతే చార్జిషీట్ల ప్రక్రియను కావాలనే ఆలస్యం చేస్తానంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం.. కీసరలోని శిల్పా లేఅవుట్ వద్ద బాధితుడి నుంచి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్‌ఐ శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి ఘటన
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SI శ్రీనివాస్
ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు#Hyderabad #Keesara #ACBRaids #SISrikanth #SI #Bigtv pic.twitter.com/dlr4V3xs3B
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2026
పోలీస్ శాఖలో క్షీణిస్తున్న విశ్వసనీయత
వెంటనే ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కీసర స్టేషన్‌లో ఇలాంటి అవినీతి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సీఐ ఆంజనేయులుతో పాటు ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి కూడా ఏసీబీకి పట్టుబడగా.. ఇప్పుడు ఎస్‌ఐ శ్రీనివాస్ అరెస్ట్ కావడంతో పోలీస్ శాఖలో వరుస అవినీతి తిమింగలాల తీరు బయటపడుతోంది. వరుసగా అధికారులు ఏసీబీకి చిక్కుతుండటంతో కీసర స్టేషన్ పేరు వింటేనే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Also Read: రాహుల్ గాంధీని అడ్డుకుంటే జరిగేది ఇదే.. ఢిల్లీ నేతలకు విహెచ్ కౌంటర్!