E-Paper
Advertisement

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!
Advertisement

Vanasthalipuram Theft: సాధారణంగా పండుగలు, శుభకార్యాల వేళ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది గంటల పాటు ఇల్లు ఖాళీగా ఉంటే చాలు, దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా వనస్థలిపురంలో జరిగిన ఒక భారీ దొంగతనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వ్యాపారి ఇంట్లో ఘోరం

Advertisement

వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ ఐరన్ వ్యాపారి అగర్వాల్ కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం ఆటోనగర్‌లోని తమ వ్యాపార సముదాయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ముందే గమనించిన నిందితులు పక్కా పథకం ప్రకారం స్కెచ్ వేశారు. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు.

రూ. లక్షల్లో సొత్తు అపహరణ

Advertisement

పూజ ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్న అగర్వాల్ కుటుంబానికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశారు. ఇంట్లోని బీరువాలు తెరిచి, బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పరిశీలించగా బీరువాలో ఉంచిన 30 తులాల బంగారం, విలువైన 4 గ్రాముల డైమండ్ చైన్ తో పాటు రూ. 20 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించి తీవ్ర షాక్‌కు గురయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు

బాధితుడు వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య! 

Tags

Related News

సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!

చార్జిషీట్ వేయాంటే రూ.2 లక్షలివ్వాల్సిందే.. ఏసీబీ దాడిలో కీసర ఎస్‌ఐ అరెస్ట్!

రాహుల్ గాంధీని అడ్డుకుంటే జరిగేది ఇదే.. ఢిల్లీ నేతలకు విహెచ్ కౌంటర్!

రాజకీయాలు ఎన్నికల వరకే! కరీంనగర్‌లో రూ.4 కోట్ల అర్బన్ పనులకు బండి సంజయ్, పొన్నం శ్రీకారం

హైదరాబాద్‌ సిటీలో భగ్గుమన్న పాత కక్షలు, కత్తులతో ఇరువర్గాల మధ్య దాడులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×