E-Paper
Advertisement

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!
Advertisement

Siddipet Accident: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వచ్చిన కారు, ట్రాక్టర్ ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంతో ఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

తండ్రీకూతుళ్ల దుర్మరణం

Advertisement

ఈ దుర్ఘటనలో హుస్నాబాద్‌కు చెందిన శ్రీకాంత్ (35), ఆయన ఏడేళ్ల కుమార్తె మహిరి అక్కడికక్కడే మృతి చెందారు. కంటిముందే చిన్నారి, భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Advertisement

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read: చార్జిషీట్ వేయాంటే రూ.2 లక్షలివ్వాల్సిందే.. ఏసీబీ దాడిలో కీసర ఎస్‌ఐ అరెస్ట్!

Tags

Related News

చార్జిషీట్ వేయాంటే రూ.2 లక్షలివ్వాల్సిందే.. ఏసీబీ దాడిలో కీసర ఎస్‌ఐ అరెస్ట్!

రాజకీయాలు ఎన్నికల వరకే! కరీంనగర్‌లో రూ.4 కోట్ల అర్బన్ పనులకు బండి సంజయ్, పొన్నం శ్రీకారం

హైదరాబాద్‌ సిటీలో భగ్గుమన్న పాత కక్షలు, కత్తులతో ఇరువర్గాల మధ్య దాడులు, ఏం జరిగింది?

బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో మారిన వాతావరణం, మొదలైన చల్లటి గాలులు

దీపావళి బాణాసంచా ఎఫెక్ట్.. సరోజినీ దేవి ఆసుపత్రికి పదుల సంఖ్యలో బాధితులు, పలువురు పరిస్థితి సీరియస్

దీపావళి వేళ బాణాసంచా నిప్పు రవ్వలు.. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు, ఆస్తి నష్టం

తిరుపతి పాలిటిక్స్‌లో రచ్చ.. సోషల్ మీడియా ప్రచారాలపై పులివర్తి సుధా రెడ్డి పైర్!

Big Stories

Advertisement
×