E-Paper
Advertisement

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!
Advertisement

Bigg Boss 10:నిన్న మొన్నటి వరకు ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ అంటూ హౌస్ లో డ్రామా నడిచింది. అయితే గత వారం నుండి త్రిగుణ్ వర్సెస్ నీతూ మధ్య వార్ ఏకంగా పెద్ద పెద్ద మాటల వరకు వెళ్తోంది అంటే వాగ్వాదం ఎంతగా ముదిరిందో అర్థమవుతోంది. ఇకపోతే తాజాగా 64వ రోజుకు సంబంధించి మొదలైన నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో నీతూ పై త్రిగుణ్ వదిలిన పదజాలం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

త్రిగుణ్ నీకు ఆస్కార్ ఇవ్వచ్చు – నీతూ

నామినేషన్ లో భాగంగా నీతూ త్రిగుణ్ ను నామినేట్ చేస్తూ.. “మీతో బాగుంటే గనుక ఓకే.. కాస్త తేడా కనిపించిందంటే వాడు బయటకు వెళ్లే వరకు మీరు టార్చర్ చూపిస్తారు”. అంటూ త్రిగుణ్ ను నామినేట్ చేసింది. అటు త్రిగుణ్ నీతూను నామినేట్ చేస్తూ.. “మనం కూర్చొని స్పెషల్ గా మాట్లాడుతున్నప్పుడు” అంటూ త్రిగుణ్ మాట్లాడుతుండగానే.. నీతో చప్పట్లు కొడుతూ “ఆస్కార్ అవార్డు ఇవ్వాలి” అంటూ కామెంట్ చేసింది. ఇక ఆమె మాట్లాడుతుండగానే.. త్రిగుణ్ కెప్టెన్ గా ఉన్న వంశీతో..” ఏయ్ నాది ఇంకా మాట్లాడ్డం అవడం లేదు.. ఏంటిది?” అంటూ ఆమెను వేలెత్తి మరీ చూపించారు.

ఇదా మీ సంస్కారం.. త్రిగుణ్..

Advertisement

“పాయింట్ కు రండి” అని నీతూ అడగగా.. “నేను పాయింట్ కి వస్తానో.. రానో.. లేదా వెను తిరిగి కాలితో ఇలా బాలును తంటానో” అంటూ యాక్షన్ చేసి మరి చూపించిన త్రిగుణ్ అక్కడితో ఆగకుండా.. రెచ్చిపోతుంటే మధ్యలో దూరిన వంశీ “ఓవర్ లాప్ చేయకండి” అంటూ గట్టిగా అరిచాడు. దీనికి నీతూ..”టెంపర్ ఉంటే మీ దగ్గర పెట్టుకో.. ప్రతి దానికి అరుస్తాడు.. ఏదో మెంటల్ ఉన్నట్టు” అంటూ కామెంట్ చేసింది . దీనికి వంశీ..”ఇక్కడ ఒక మెడికల్ రూమ్ ఉంది. అడగండి మీకు చెక్ చేస్తారు” అంటూ నీతూ మాస్టర్ కి కౌంటర్ ఇచ్చాడు. ఇక తర్వాత త్రిగుణ్ ను రోహిత్ ని ప్రస్తావిస్తూ..” మా తమ్ముడు వద్దని చెప్పాడు. నేను తీసుకుంటే బాగోదు” అంటూ ఆమె చెప్పినట్లు వెటకారంగా ప్రవర్తించాడు.,” ఈ వెటకారమే నాకు నచ్చట్లేదు “అంటూ నీతూ చెప్పగా .. త్రిగుణ్ ఆమెపై ఫైర్ అవుతూ.. “ఇదా పెద్దరికం.? ఇదా మీరు నేర్చుకున్న సంస్కారం” అంటూ ఫైర్ అయ్యాడు..

ALSO READ:వచ్చే ఏడాది పెళ్లి.. బిగ్ బాంబ్ పేల్చిన సుప్రీత!

ఇంట్లో ఉండడానికి అర్హత ఉందా?

Advertisement

ఇక తర్వాత వంశీ నామినేషన్ లో నీతూ మాస్టర్ ను నామినేట్ చేస్తూ.. “ఇంట్లో ఉండడానికి అసలు అర్హులు కారు మీరు” అంటూ నీతో మాస్టర్ ని నామినేట్ చేయగా.. “సిగ్గు లజ్జ అని మాట్లాడే మీకు ఉందా హౌస్ లో ఉండడానికి అర్హత ?” అంటూ రెచ్చిపోయింది. మళ్లీ మధ్యలో త్రిగుణ్ వాదలాడగా “జోకర్ జోకర్” అంటూ ఫైర్ అయిన నీతూ తన చెంపపై తాను కొట్టుకొని మరీ తనను తాను కంట్రోల్ చేసుకుంది. మొత్తానికైతే ఈ ప్రోమో చాలా గట్టిగానే నామినేషన్ జరుగుతున్నట్టు చూపించింది.

Related News

అబ్బబ్బా.. ఏం పాటరా బాబు! ఈశ్వర్ సాయి, మధురి రాథోడ్ రచ్చ!

వచ్చే ఏడాది పెళ్లి.. బిగ్ బాంబ్ పేల్చిన సుప్రీత!

అలీ వైఫ్ జుబేదా యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

వెయిటింగ్ ఈజ్ ఓవర్.. వెండితెరపై కలుద్దాం: యాంకర్ శివ జ్యోతి!

సుదీర్ లక్షలు సంపాదిస్తున్న రూపాయి కూడా లేదా?అంతా అతని చేతుల్లోనే ?

అలా ఈడ్చుకెళ్తుంటే కనిపించలేదా మీకు.. నరేష్ పై నీతూ మాస్టర్ ఫైర్!

నేను లేకపోతే కెప్టెన్ కాదు కదా కంటెండర్ షిప్ కూడా కాలేవ్.. ముఖేష్ కౌంటర్!

Big Stories

Advertisement
×